
ఈ వారం ఓటీటీలో మలయాళ సినిమాల వరద పారుతోంది. ముఖ్యంగా మే 30న మూడు సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి. వీటిలో బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ ‘తుడరుం’ కూడా ఉంది. మరి ఆ సినిమాలేంటో తెలుసుకుందాం.
Key Points
మే 30న మూడు మలయాళ సినిమాలు ఓటీటీలో రిలీజ్
బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ 'తుడరుం' జియో సినిమాలో స్ట్రీమింగ్
'బిగ్ బెన్' థ్రిల్లర్ సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంటుంది
'డ్యాన్స్ పార్టీ' కామెడీ మనోరమ మ్యాక్స్ లో విడుదల
ఓటీటీలోకి వస్తున్న మూడు మలయాళ సినిమాలు
ఈవారం ఓటీటీ, థియేటర్లలోకి మలయాళం సినిమాలు క్యూ కడుతున్నాయి. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ మూవీస్ వస్తున్నాయి. ఒకే రోజు మూడు మూవీస్ ఓటీటీలోకి, రెండు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటి? వాటిని ఎక్కడ చూడాలో తెలుసుకోండి.
బిగ్ బెన్ ఓ మలయాళం థ్రిల్లర్ మూవీ. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. సుమారు ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. సన్ నెక్ట్స్ ఓటీటీలో శుక్రవారం (మే 30) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది యూకేలో ఉంటున్న జీన్ ఆంటోనీ, అతని భార్య లవ్లీ చుట్టూ తిరిగే స్టోరీ.
పోలీస్ ఆఫీసర్ అయిన జీన్.. ఓ రోజు లవ్లీతోపాటు పని చేసే వ్యక్తితో గొడవ పడటంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ల ఏడాదిన్నర కూతురిని అక్కడి వెల్ఫేర్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ మూవీ స్టోరీ. ఐఎండీబీలో 7.4 రేటింగ్ ఉన్న ఈ సినిమా మలయాళం ఆడియోతో రానుంది.
బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ ‘తుడరుం’ ఓటీటీ ప్రయాణం
ఈ ఏడాది అతిపెద్ద మలయాళం బ్లాక్‌బస్టర్లలో ఒకటైన తుడరుం (Thudarum) కూడా శుక్రవారమే (మే 30) ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ఈ మూవీని జియోహాట్‌స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. మలయాళంతోపాటు తెలుగులోనూ రానుండటం విశేషం. ఇందులో బెంజ్ షణ్ముగం పాత్రలో మోహన్‌లాల్ నటించాడు. ఇదొక రివేంజ్ థ్రిల్లర్ మూవీ. థియేటర్లలో రూ.230 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ తుడరుం.. ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డ్యాన్స్ పార్టీ – మనోరమ మ్యాక్స్
మరికొన్ని విశేషాలు
డ్యాన్స్ పార్టీ అనే మరో మలయాళ కామెడీ సినిమా కూడా శుక్రవారం (మే 30) ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాను మనోరమ మ్యాక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. షైన్ టామ్ చాకో, శ్రీనాథ్ భాసి నటించిన ఈ కామెడీ మూవీ.. అన్నదమ్ములు, వాళ్ల ప్రేమలు, పెళ్లిళ్ల చుట్టూ తిరిగే స్టోరీ. 2023లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మొత్తానికి ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.
ఓటీటీలోకి ఈ వారం ఒకే రోజు మూడు మలయాళం సినిమాలు రానుండగా.. అదే రోజు మరో రెండు మూవీస్ థియేటర్లలో రిలీజ్ కానుండటం విశేషం. మూన్‌వాక్, సూత్రవాక్యం అనే సినిమాలు ఈ శుక్రవారం (మే 30) థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి.
చివరగా, ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు మలయాళ సినిమాల పండగే. విభిన్న రకాల సినిమాలు అందుబాటులో ఉండటం సంతోషదాయకం.


