
తెలుగు సినిమా నటుడు అదిత్ అరుణ్ అలియాస్ త్రిగుణ్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య నివేదిత సెప్టెంబర్ 2న డెలివరీ అయింది. ఈ సందర్భంగా చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Key Points
తెలుగు సినిమా నటుడు అదిత్ అరుణ్ (త్రిగుణ్) తండ్రి అయ్యాడు.
సెప్టెంబర్ 2న ఆయన భార్య నివేదితకు డెలివరీ అయింది.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున బిడ్డ పుట్టిందని అభిమానులు ఆనందిస్తున్నారు.
బిడ్డ పాపా లేక బాబు అనే విషయం ఇంకా వెల్లడించలేదు.
త్రిగుణ్ తండ్రి అయ్యాడు
Thrigun : తెలుగులో కథ, 24 కిసెస్, డియర్ మేఘ, కొండా, లైన్ మెన్, ప్రేమ దేశం, ఉద్వేగం.. లాంటి పలు సినిమాలతో మెప్పించిన హీరో అదిత్ అరుణ్ అలియాస్ త్రిగుణ్. అదిత్ అరుణ్ ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాడు. హీరోగా, కీలక పాత్రల్లో సినిమాలు చేస్తున్నాడు. 2023 లో అదిత్ అరుణ్ నివేదితా అనే అమ్మయిని పెళ్లి చేసుకున్నాడు.(Thrigun)
తాజాగా అదిత్ అరుణ్ – నివేదిత జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అదిత్ తన భార్య బేబీ బంప్ తో ఉన్న ఫోటో షేర్ చేసి సెప్టెంబర్ 2న డెలివరీ అయినట్టు తెలిపాడు. అయితే పుట్టింది పాప? లేక బాబు అనేది మాత్రం చెప్పలేదు. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు తాజాగా తల్లితండ్రులు అయిన ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున డెలివరీ
Also See : Jabardasth Abhi : ఆ నటితో జబర్దస్త్ అభి క్లోజ్ ఫొటోలు వైరల్..
సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
ఇక సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో పవన్ పుట్టిన రోజు నాడు పుట్టారు అని పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అదిత్ అరుణ్ దంపతులకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున బిడ్డ పుట్టడం విశేషం.


