
చిన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టి, ‘బేబి’ దర్శకుడిగా పేరుపొందిన సాయి రాజేష్ టీనేజ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన గత చిత్రాలు, జాతీయ అవార్డులు, భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
Key Points
దర్శకుడు సాయి రాజేష్ టీనేజ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్.
'బేబి' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి రాజేష్.
'హృదయ కాలేయం', 'కొబ్బరిమట్ట' వంటి చిత్రాలను గతంలో దర్శకత్వం వహించారు.
'కలర్ ఫోటో', 'బేబి' చిత్రాలకు జాతీయ అవార్డులు.
సాయి రాజేష్ టీనేజ్ ఫోటో వైరల్
హీరోహీరోయిన్లు గానీ డైరెక్టర్స్ గానీ సెలబ్రిటీలు అయిపోయిన తర్వాత కానీ మీడియాలో ఎప్పుడుపడితే అప్పుడు కనిపిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు మాత్రం వీళ్లకు సంబంధించిన పాత ఫొటోలు లేదంటే చిన్ననాటి చిత్రాలు బయటపడుతుంటాయి. అప్పట్లో ఇలా ఉండేవారా అని నెటిజన్ల ఆశ్చర్యపోవడం గ్యారంటీ. ఇప్పుడు అలానే ఓ తెలుగు డైరెక్టర్.. తన టీనేజీ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరి ఇతడెవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
పైన ఫొటోలో కనిపిస్తున్నది డైరెక్టర్ సాయి రాజేశ్. ఇలా చెబితే కొందరు గుర్తుపడతారు గానీ ‘బేబి’ మూవీ తీసిన దర్శకుడు అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. రెండేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ అంతా ఈ మూవీ చూసి తెగ ఫీలయిపోయారు. కొందరైతే థియేటర్లలోనే ఏడ్చేశారు కూడా! అయితే సాయి రాజేశ్‌కి ఇదే తొలి చిత్రం కాదు.. గతంలో రెండు తీశాడు కాకపోతే అవి కామెడీవి కావడంతో పెద్దగా రిజిస్టర్ కాలేదు.
‘బేబి’ దర్శకుడి గత చిత్రాలు
నెల్లూరుకి చెందిన సాయి రాజేశ్.. టాలీవుడ్‌లో తీసిన తొలి సినిమా ‘హృదయ కాలేయం’. సంపూర్ణేశ్ బాబుని హీరోగా పెట్టి తీశాడు. కానీ తన పేరు మాత్రం స్టీఫెన్ శంకర్ అని వేసుకున్నాడు. తర్వాత ఇదే సంపూర్ణేశ్ బాబుతో ‘కొబ్బరిమట్ట’ అనే చిత్రం తీశాడు. ఈ రెండూ బాగానే ఆడాయి కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో రూట్ మార్చాడు. ‘కలర్ ఫొటో’ అనే చిత్రానికి స్టోరీ అందించిన సాయి రాజేశ్.. నిర్మాతగానూ వ్యవహరించాడు. నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. ‘బేబి’కి కూడా జాతీయ సినీ అవార్డ్ రావడం విశేషం.
తదుపరి ప్రాజెక్ట్‌లు, రీమేక్‌లు
‘బేబి’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి రాజేశ్.. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. చాన్నాళ్ల నుంచి ముందుకు కదట్లేదు. మరోవైపు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’కి స్టోరీ అందిస్తున్నాడు. మరి సాయి రాజేశ్ నుంచి తర్వాత సినిమా ఎప్పుడొస్తుందో ఏంటో?
సాయి రాజేష్ తన విభిన్నమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘బేబి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత, ఆయన తదుపరి సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


