|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చెప్పవే చిరుగాలి షూటింగ్ ఇక్కడే చేశాం: హీరోయిన్ అభిరామి.. ఇలాంటి క్యారెక్టర్ చేయలేదంటూ త్రిష కామెంట్స్

Published: 30-05-2025, 2:13 AM
చెప్పవే చిరుగాలి షూటింగ్ ఇక్కడే చేశాం: హీరోయిన్ అభిరామి.. ఇలాంటి క్యారెక్టర్ చేయలేదంటూ త్రిష కామెంట్స్

కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి నటించిన థగ్ లైఫ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరిగింది. ఈ ఈవెంట్ లో హీరోయిన్స్ త్రిష, అభిరామి తమ పాత్రలు, సినిమా షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Key Points

1

త్రిష 'థగ్ లైఫ్' లో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

2

అభిరామి 'చెప్పవే చిరుగాలి' సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరిగిందని తెలిపింది.

4

'థగ్ లైఫ్' జూన్ 5న విడుదల కానుంది.

థగ్ లైఫ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ డ్రామా సినిమా థగ్ లైఫ్. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో శింబు మరో ప్రధాన పాత్ర పోషించాడు. అతనితోపాటు త్రిష హీరోయిన్‌గా చేసింది.

అలాగే, తెలుగులో చిరుగాలి సినిమాతో అలరించిన అభిరామి థగ్ లైఫ్‌లో మరో హీరోయిన్‌గా చేసింది. అంతేకాకండా కమల్ హాసన్‌తో లిప్ లాక్ సీన్‌తో థగ్ లైఫ్ ట్రైలర్‌లో షాక్ ఇచ్చింది. థగ్ లైఫ్ మూవీ జూన్ 5న వరల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

తెలుగు రాష్ట్రాల్లో థగ్ లైఫ్ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై హీరో నితిన్ తండ్రి, నిర్మాత ఎన్ సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఆయన గతంలో అమరన్, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను రిలీజ్ చేశారు. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో మే 29న వైజాగ్‌లో థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహంచారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్స్ అభిరామి, త్రిష ఇంట్రెస్టింగ్ విశేషాలు చెబుతూ కామెంట్స్ చేశారు.

త్రిష కామెంట్స్

హీరోయిన్ త్రిష మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. వర్షం సినిమా రిలీజ్ 22 ఏళ్లు అవుతుంది. ఇప్పటికీ ఇంత అభిమానం చూపిస్తున్న మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వైజాగ్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో కమల్ హాసన్ గారితో ఫస్ట్ టైం కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది” అని చెప్పింది.

“థగ్ లైఫ్ సినిమాలో ఇంద్రాణి అనే క్యారెక్టర్ చేశాను. తప్పకుండా ఆడియన్స్‌కి గుర్తుండిపోయే పాత్ర ఇది. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. తప్పకుండా ఈ సినిమా మీరు చూడాలి. కచ్చితంగా మీకు నచ్చుతుంది” అని తెలిపింది హీరోయిన్ త్రిష కృష్ణన్.

అభిరామి అనుభవాలు

మరో హీరోయిన్ అభిరామి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. చెప్పవే చిరుగాలి సినిమా ఇక్కడే షూటింగ్ చేశాం. వైజాగ్ నాకు చాలా స్పెషల్. మంచి సినిమా ఎక్కడి నుంచి వచ్చిన తెలుగు తెలుగు ప్రేక్షకులు దాన్ని ఘన విజయం చేస్తారు. ఈ సినిమా నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్” అని అన్నారు.

“మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, శింబు గారు లాంటి లెజెండ్స్‌తో వర్క్ చేయడం ఒక డ్రీమ్. జూన్ 5వ తేదీన అందరూ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు” అని అభిరామి పేర్కొన్నారు.

థగ్ లైఫ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ విజయవంతంగా ముగిసింది. త్రిష, అభిరామి సినిమా గురించి పంచుకున్న విషయాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. జూన్ 5వ తేదీన విడుదలయ్యే ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.