
కమల్ హాసన్ మరియు మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమా విడుదలైంది. ఈ సినిమాపై ట్విట్టర్‌లో విడుదలైన రివ్యూలు మిశ్రమంగా ఉన్నాయి. కొందరు సినిమాను ప్రశంసిస్తే, మరికొందరు విమర్శిస్తున్నారు.
Key Points
కమల్ హాసన్, శింబుల నటనకు ప్రశంసలు
మణిరత్నం దర్శకత్వంపై మిశ్రమ స్పందన
ట్విట్టర్‌లో థగ్ లైఫ్‌పై మిశ్రమ స్పందన
ట్విట్టర్‌లో థగ్ లైఫ్ రివ్యూలు
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టార్ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ థగ్ లైఫ్. ఈ సినిమాకు కోలీవుడ లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించారు. ఇదివరకు 1987లో మణిరత్నం-కమల్ హాసన్ కాంబినేషన్‌లో నాయగన్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
ఇప్పుడు నాయగన్ తర్వాత 30 ఏళ్లకు కమల్ హాసన్ -మణిరత్నం కాంబోలో తెరకెక్కిన థగ్ లైఫ్ ఇవాళ (జూన్ 5) థియేటర్లలో విడుదల కానుంది. కమల్ హాసన్‌తోపాటు త్రిష, శింబు, అభిరామి, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, సాన్య మల్హోత్రా వంటి స్టార్స్ నటించిన థగ్ లైఫ్ ప్రీమియర్స్ ఇదివరకే పడిపోయాయి.
ఈ సినిమా చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా థగ్ లైఫ్‌పై రివ్యూ లు ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో థగ్ లైఫ్ ట్విట్టర్ రివ్యూలు వైరల్ అవుతున్నాయి. థగ్ లైఫ్‌పై ఆడియెన్స్, నెటిజన్ టాక్ ఎలా ఉందో ట్విటర్ రివ్యూలో తెలుసుకుందాం.
నటనపై ప్రశంసలు, విమర్శలు
“ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్. ఫస్టాఫ్‌లో కమల్ హాసన్ షో మొత్తం దోచేశాడు. కమల్ హానస్, శింబు సన్నివేశాలు అదిరిపోయాయి. చాలా ఎంగేజింగ్‌గా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఫైరే. సెకండాఫ్‌లో తన నటనతో శింబు అదరగొట్టాడు. కమల్, శింబు మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ బెస్ట్ ఆఫ్ ది డికెడ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ బ్లాస్ట్” అని రివ్యూ ఇస్తూ 5కి 4.75 రేటింగ్ ఇచ్చారు.
“ప్రతి ఫ్రేమ్‌లో శింబు నటనతో అదరగొట్టాడు. శింబు యాక్టింగ్ చేయలేదు. తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే గూస్‌బంప్స్ ఇచ్చే మెటీరియల్” అని ఒకరు చెప్పుకొచ్చారు.
“థగ్ లైఫ్ సెకండాఫ్ మ్యాడ్‌గా ఉంది. ఒక్కదాంట్లో అన్ని రకాల ఎమోషన్స్ ఫీల్ అయ్యేలా చేసే ఏకైక డైరెక్టర్ మణిరత్నం మాత్రమే. మణిరత్నం నిజంగా చాలా స్పెషల్. అంజు వన్న పూవే పోర్షన్ ఏడిపిస్తుంది. శింబు ఎప్పటిలాగే అదరగొట్టాడు. కమల్ హాసన్‌ను ఎందుకు గురువు అంటారో మరోసారి నిరూపించారు” అని మరొక ఎక్స్ యూజర్ తెలిపారు.
సినిమా కథ, దర్శకత్వంపై అభిప్రాయాలు
“కమల్ హాసన్- త్రిష మధ్య వచ్చే లవ్ పోర్షన్ చాలా డల్‌గా ఉన్నాయి. శింబు, అభిరామి నీట్‌గా చేశారు. పాటలు బాగున్నాయి. ఢిల్లీ ల్యాండ్‌స్కేప్ విజువల్స్ అదిరిపోయాయి. బలహీనమైన కథ, ఎమోషన్స్ లేవు, పెద్దగా ట్విస్టులు లేవు. ఆసక్తిగా లేని సాగదీసే నెరేషన్. డిసాప్పాయింట్‌మెంట్. సినిమా, పాలిటిక్స్, ఫ్యామిలీ అంశాలు ఫెయిల్ అయ్యాయి” అంటూ 10కి 2 స్టార్ రేటింగ్ ఇచ్చారు ఒక యూజర్.
ఇలా థగ్ లైఫ్ మూవీపై మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. కమల్ హాసన్ , శింబు యాక్టింగ్ అదిరిపోయిందన, సినిమాటోగ్రఫీ చాలా బాగుందని ప్లస్‌లతోపాటు త్రిషతో వచ్చే లవ్ సీన్స్, మ్యూజిక్ నిరాశపరిచిందని మైనస్ అంశాలను చెబుతున్నారు. కొన్ని సీన్స్ మెప్పిస్తాయని, సెకండాఫ్ ఊహించనంతగా లేదని సినిమా చూసిన వారు థగ్ లైఫ్ రివ్యూ ఇస్తున్నారు.
మొత్తం మీద, థగ్ లైఫ్ సినిమాపై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు సినిమాను ఆదరిస్తే, మరికొందరు నిరాశ చెందారు. చివరకు ప్రేక్షకుల అభిప్రాయాలే నిర్ణయిస్తాయి.


