|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టికెట్ కొట్టు ఐఫోన్ పట్టు .. మీ అందరికి ‘వర్జిన్ బాయ్స్’ బంపర్ ఆఫర్

Published: 05-07-2025, 8:50 AM
టికెట్ కొట్టు ఐఫోన్ పట్టు .. మీ అందరికి ‘వర్జిన్ బాయ్స్’ బంపర్ ఆఫర్

‘వర్జిన్ బాయ్స్’ అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ జూలై 11న విడుదలవుతోంది. గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ దయానంద్ దర్శకత్వం వహించారు. సినిమా టికెట్ కొన్న వారికి ఐఫోన్లు బహుమతిగా ఇవ్వడం విశేషం.

Key Points

1

జూలై 11న విడుదల అవుతున్న 'వర్జిన్ బాయ్స్' సినిమా ట్రైలర్ విడుదలైంది.

2

సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు బహుమతిగా.

4

కాలేజీ రోజుల్లోని సంఘటనల ఆధారంగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.

‘వర్జిన్ బాయ్స్’ సినిమా విడుదల తేదీ

గీతానంద్ (Geetanand), మిత్రా శర్మ (Mitra Sharma) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వర్జిన్ బాయ్స్’(Virgin Boys). యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి దయానంద్ (Director Dayanand) దర్శకత్వం వహిస్తుండగా.. రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్‌పై రాజా దరపునేని నిర్మిస్తున్నారు. శ్రీహాన్(Srihan), జెన్నీఫర్ ఇమాన్యుల్(Jennifer Emanuel), రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా దర్శకుడు దయానంద మాట్లాడుతూ… ‘మేము కాలేజీ రోజుల్లో ఉండగా చేసిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా మొదలు పెట్టాము. ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అందరికీ కనెక్ట్ అవుతాయి. చిత్రానికి చాలా మంచి బృందం నాకు లభించినందుకు సంతోషంగా ఉంది. స్మరణ్ సాయి (Music director Smaran Sai) సంగీతం ఈ సినిమాకు బోనస్‌గా నిలుస్తుంది. మా అన్నయ్య గీతానంద్‌తో నాకు ఇది రెండవ చిత్రం. అలాగే గీతానంద్, మిత్ర శర్మ మధ్య సీన్లు అద్భుతంగా వచ్చింది. జూలై 11వ తేదీన ప్రేక్షకులంతా చూడవలసిన సినిమా వర్జిన్ బాయ్స్’ అన్నారు. అలాగే.. ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్‌తో కొన్ని థియేటర్లలో డబ్బు మీపై వర్షంలో కురుస్తుందని, ఆ డబ్బును ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు అంటూ తెలిపారు.

ఐఫోన్ బహుమతి ఆఫర్ వివరాలు

‘మనీ రైన్’ కాన్సెప్ట్

మొత్తానికి, ‘వర్జిన్ బాయ్స్’ సినిమా యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలతో రూపొందినట్లు తెలుస్తోంది. ఐఫోన్ ఆఫర్‌తో పాటు, ‘మనీ రైన్’ కాన్సెప్ట్ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.