|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అండర్‌ వేర్‌లో క్రికెట్‌ అడిన స్టార్‌ హీరో.. ట్రోల్స్‌పై ఫన్నీ రిప్లై!

Published: 13-06-2025, 3:00 AM
అండర్‌ వేర్‌లో క్రికెట్‌ అడిన స్టార్‌ హీరో.. ట్రోల్స్‌పై ఫన్నీ రిప్లై!

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ అండర్ వేర్ ధరించి క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఆయనను విమర్శించగా, టైగర్ ఆ వ్యాఖ్యలకు ఫన్నీగా స్పందించాడు.

Key Points

1

టైగర్ ష్రాఫ్ అండర్ వేర్ లో క్రికెట్ ఆడిన వీడియో వైరల్

2

నెటిజన్ల నుండి విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు

4

టైగర్ ష్రాఫ్ తాజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి

అండర్ వేర్ లో క్రికెట్ ఆట

బాలీవుడ్‌ స్టార్‌ హీరో క్రికెట్‌ ఆడితే.. అందరూ అతన్ని ట్రోల్‌ చేస్తున్నారు. అదేంటి క్రికెట్‌ ఆడితే తప్పేంటి? హీరోలు క్రికెట్‌ ఆడోద్దా ఏంటి? అంటారా?  ఆ హీరో ఆటని ఎవరు తప్పుపట్టడం లేదు. ఆ ఆట ఆడేందుకు వేసుకొచ్చిన దుస్తులపైనే అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  బంతి-బ్యాట్‌ ఆట ఆడేందుకు అండర్‌వేర్‌ ధరించి గ్రౌండ్‌లోకి వచ్చాడు. దానికి సంబంధించిన వీడియోని సదరు హీరోనే ఇన్‌స్టాలో షేర్‌ చేయగా.. అదికాస్త వైరల్‌ అయి అతన్ని ట్రోలింగ్‌కి గురి చేసింది.  ఆ హీరో ఎవరో కాదు.. తెలుగు సినిమాలను హిందీలో రీమేక్‌ చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్న టైగర్‌ ష్రాఫ్‌.

2014లో వచ్చిన హీరోపంతి సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు టైగర్ ష్రాఫ్. ఈ సినిమా అల్లు అర్జున్‌ నటించిన పరుగు చిత్రానికి బాలీవుడ్‌ రీమేక్‌. ఇక ఈ సినిమా త‌ర్వాత బాఘీ, బాఘీ2 వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరో రేంజ్‌కు వెళ్లిపోయాడు. తాజాగా ఈ యంగ్‌ హీరో, అక్షయ్‌ కుమార్‌, కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్యలతో కలిసి క్రికెట్‌ ఆడాడు. అయితే ఆ సమయంలో టైగర్‌ కేవలం అండర్‌వేర్‌ మాత్రమే ధరించాడు. తన బాడీని ఎక్స్‌పోజ్‌ చేస్తూ క్రికెట్‌ ఆడాడు. ఆ వీడియోని ఇన్‌స్టాలో షేర్‌ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.

నెటిజన్ల నుండి ట్రోలింగ్

ఈ వీడియోలో అక్షయ్ కుమార్, గణేష్ ఆచార్యలతో కలిసి బీచ్‌లో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. అయితే, టైగర్ ఒక్కడే అండర్‌వేర్‌లో ఆడటంతో నెటిజన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేసి, ట్రోల్ చేశారు. “చెడ్డీ ప్రీమియర్ లీగ్”,  “ఊర్ఫీ జావేద్ మేల్ వెర్షన్” అంటూ కామెంట్స్‌ చేశారు. కొందరు అతని ఫిట్‌నెస్‌ను ప్రశంసించినప్పటికీ, చాలామంది అతన్ని విమర్శించారు.

టైగర్ ష్రాఫ్ ప్రతిస్పందన

తాజాగా ఈ ట్రోల్స్‌పై టైగర్‌ ష్రాఫ్‌ స్పందిస్తూ మరో వీడియోని ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. అందులో ఈ సారి ట్రాక్‌ ప్యాంట్‌ వేసుకొని క్రికెట్‌ ఆడుతున్నాడు. ఈ వీడియోని షేర్‌ చేస్తూ.. ‘ట్రాక్‌ ప్యాంట్‌లోనూ అదే స్థితి’ అని కాస్త ఫన్నీగా రాసుకొచాడు. ఇక టైగర్‌ ష్రాఫ్‌ కెరీర్‌ విషయానికొస్తే.. ఈ మధ్య ఆయనకు సరైన హిట్‌ పడలేదు. ఆయన చివరగా నటించిన సింగం అగైన్, బ‌డే మియాన్ చోటే మియాన్ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచాయి. ప్రస్తుతం  బాఘీ4 చేస్తున్నాడు.

టైగర్ ష్రాఫ్ వైరల్ వీడియోకు తనదైన శైలిలో స్పందించడం ఆసక్తికరం. అయితే, ఆయన సినిమా కెరీర్ పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.