
📌 Key Points
- తిరుపతి – కొల్హాపూర్ రైలుకు నందలూరులో కొత్త స్టాప్
- మార్చి 22 నుంచి ఆరు నెలల పాటు స్టాప్ అందుబాటులో ఉంటుంది
- రాత్రి 10.58 నిమిషాలకు నందలూరుకు రైలు చేరుకుంటుంది
- తిరుపతి, మహారాష్ట్ర ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది
ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. తిరుపతి – కొల్హాపూర్ మధ్య నడిచే రైలు కడప జిల్లాలోని నందలూరు రైల్వే స్టేషన్లో ఇకపై ఆగుతుంది. ఈ నిర్ణయం మార్చి 22 నుంచి అమలులోకి వస్తుంది.
నందలూరులో తిరుపతి – కొల్హాపూర్ రైలు స్టాప్
ఏపీ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది.తిరుపతి – కొల్హాపూర్ – తిరుపతి మధ్య నడిచే ట్రైన్… ఇకపై కడప జిల్లాలోని నందలూరు రైల్వే స్టేషన్ లో ఆగనుంది. ఈ నిర్ణయం మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
తిరుపతి – కొల్హాపూర్ మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 17415 ) కడప జిల్లాలని నందలూరు స్టేషన్లో ఆగుతుంది. అంతేకాకుండా కొల్హాపూర్ – తిరుపతి మధ్య నడిచే (ట్రైన్ నెంబర్ 17416) రైలు కూడా ఈ స్టేషన్ లో ఆగనుంది. ప్రయోగత్మకంగా ఈ స్టాపేజీ నిర్ణయాన్ని అమలు చేయనున్నారు.
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త
ఈ కొత్త స్టాపేజీ నిర్ణయం మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆరు నెలల పాటు ఈ స్టాపేజీ సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. తిరుపతితో పాటు మహారాష్ట్రకు వెళ్లే స్థానిక ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంటుంది.
తిరుపతి – కొల్హాపూర్ ట్రైన్ రాత్రి 09.30 గంటలకు బయల్దేరి… మరునాడు సాయంత్రం 04.35 నిమిషాలకు కొల్హాపూర్ కు చేరుతుంది. కొత్తగా స్టాపేజీగా ఉన్న నందలూరు రైల్వే స్టేషన్ కు రాత్రి 10.58 నిమిషాలకు చేరుకుంటుంది. రాత్రి 11 గంటలకు అక్కడ్నుంచి బయల్దేరుతుంది.
స్టాపేజీ వివరాలు, సమయాలు
ఇక కొల్హాపూర్ నుంచి తిరుపతి వచ్చే ట్రైన్ …. ఉదయం 11. 50 నిమిషాలకు బయల్దేరి… మరునాడు ఉదయం 08.15 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ కూడా నందలూరు రైల్వే స్టేషన్ లో 2 నిమిషాలపాటు ఆగుతుంది.
ఈ ట్రైన్స్… తిరుపతి, రేణిగుంట, రాజంపేట, నందలూరు , కడప , తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు,హోసిపేట్, మునిరాబాద్, హుబ్లీ, దర్వార్, ఖానాపూర్, బెల్గావి, రాయ్ బాగ్, మిరాజ్ జంక్షన్, కొల్హాపూర్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం తిరుపతి మరియు మహారాష్ట్ర ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. నందలూరులో స్టాప్ ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంత ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.


