
📌 Key Points
- గ్యాస్ కొరత నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు రూ.2 రాయితీ ప్రకటించింది.
- హోటళ్లు, చిన్న తరహా పరిశ్రమలకు ఈ రాయితీ వర్తిస్తుంది.
- కేంద్రం ఆంక్షలు అమల్లో ఉన్నంత వరకు రాయితీ కొనసాగుతుంది.
దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ వాడకం తగ్గించి విద్యుత్ వినియోగించే వారికి రాయితీ ప్రకటించింది. దీని ద్వారా ప్రజలకు కొంత ఊరట లభించనుంది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
గ్యాస్ కొరతతో ప్రజల ఇబ్బందులు
ఇరాక్ యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయగా గృహవినియోగ గ్యాస్ సిలిండర్ల విషయంలో ఆందోళన నెలకొంది. దీంతో ఎలక్ట్రిక్ స్టౌవ్‍లు, కుక్కర్ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వినియోగంపై రాయితీ ప్రకటించింది. తమిళనాడులో ఏర్పడిన వాణిజ్య గ్యాస్ (Commercial LPG) కొరతపై ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ శనివారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
హోటళ్లు, చిన్న తరహా పరిశ్రమలు (MSME), ఇతర ఆహార తయారీ కేంద్రాలు గ్యాస్ కొరత వల్ల మూతపడకుండా చూసేందుకు ఈ రాయితీని ప్రకటించిది. వంటగ్యాస్ కొరత కారణంగా ఎల్‌పీజీ స్టౌవ్‌లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్‌లను (Electric Stoves) వాడే హోటళ్లు, టీ షాపులు, క్లౌడ్ కిచెన్‌లు మరియు ఆహార తయారీ యూనిట్లకు అదనపు విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు రూ.2 చొప్పున రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ వినియోగంపై విధించిన ఆంక్షలు అమల్లో ఉన్నంత వరకు ఈ రాయితీ కొనసాగుతుందని తెలిపింది.
విద్యుత్ రాయితీ ప్రకటించిన ప్రభుత్వం
ఎవరికి ఈ రాయితీ వర్తిస్తుంది?
తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్న హోటళ్లు మరియు చిన్న తరహా పరిశ్రమలకు ఊరటనిస్తుంది. కేంద్రం ఆంక్షలు ఎత్తివేసే వరకు ఈ రాయితీ కొనసాగనుంది.


