|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Today Rasi Phalalu (18.04.2025): ఈరోజు ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి!

Published: 17-04-2025, 6:43 PM
Today Rasi Phalalu (18.04.2025): ఈరోజు ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి!

18.04.2025 తేదీన, వివిధ రాశుల వారికి సంబంధించిన రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి. ఈరోజు కొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండటం అవసరం. వివరాల కోసం చదవండి.

Key Points

1

ఈరోజు రాశి ఫలాల ప్రకారం, కొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.

2

అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది.

4

ఆరోగ్యం, కుటుంబం పట్ల శ్రద్ధ వహించాలి.

మేషం నుండి కర్కాటకం వరకు రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 18.04.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: చైత్ర, వారం : శుక్రవారం, తిథి : కృ. షష్టి , నక్షత్రం : మూల

మేష రాశి వారి కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. సంకల్ప బలంతోనే లక్ష్యం సాధిస్తారు. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. లావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టం మీద నెరవేరుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. పిల్లల విజయం సంతోషం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. సన్నిహితులను సంప్రదిస్తారు.

వృషభ రాశి వారి కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సమర్థతను చాటుకుంటారు. కీలక అంశాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి. నగదు, వాహనం జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. తరచూ సన్నిహితులతో సంభాషిస్తారు. పిల్లల చదువులను వారి ఇష్టానికే వదిలేయండి.

సింహం నుండి మీనం వరకు రాశి ఫలాలు

మిథున రాశి వారికి గ్రహాల సంచారం బాగుంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పొదుపు ధనం అందుతుంది. అస్తలకు సాయం అందిస్తారు. మీ విజ్ఞత ఆకట్టుకుంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు. స్వీకరిస్తారు. అందరితో కలుపుగోలుగా మెలగండి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.

కర్కాటక రాశి వారు నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంస్థల స్థాపనకు అనుకూలం. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. ఆరోగ్యం జాగ్రత్త తరచూ బంధువులతో సంభాషిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ద వహిస్తారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.

సింహ రాశి వారికి ప్రతికూలతలు అధికం. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదాల చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. లావాదేవీల్లో ఆచితూచి అడుగేయండి.

కన్య రాశి వారికి సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, ఆకాలభోజనం వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోబాలకు లొంగవద్దు. పెట్టుబడులకు తరుణం కాదు. మీ నిర్ణయాన్ని వాయిదా వేయండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. దళారులను ఆశ్రయించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.

తుల రాశి వారి కార్యం సిద్ధిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. అన్ని విధాలా ప్రోత్సాహకరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసి వచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి, సందేహాలకు తావివ్వవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. శుభకార్యానికి హాజరవుతారు.

ప్రతి రాశికి ప్రత్యేక సూచనలు

వృశిక రాశి వారికి గ్రహాల సంచారం బాగుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. వాయిదా చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. పనులు, బాధ్య తలు స్వయంగా చూసుకోండి. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.

మీదైన రంగంలో రాణిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేయగల్గుతారు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. గృహ మరమ్మతులు చేపడతారు. అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం తగదు.

మకర రాశి వారి కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. దృఢసంకల్పంతో అడుగు ముందుకేస్తారు. సాయం ఆశించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆరోగ్యం కుదుట పడుతుంది. నోటీసులు అందుకుంటారు.

కుంభ రాశి ఆశాజనకం. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఒంటెద్దుపోకడ తగదు. ఎదుటివారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. అయినవారి కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది.

మీన రాశి వారికి సర్వత్రా అనుకూలదాయకం. అనుకూల ఫలితాలున్నాయి. మీ కష్టం ఫలిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు.

ఈరోజు రాశిఫలాల ప్రకారం, అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోండి. శుభం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.