|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

`తొలి ప్రేమ` హీరోయిన్‌ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఆమె చేసే పని ఇదే

Published: 16-08-2025, 11:10 PM
`తొలి ప్రేమ` హీరోయిన్‌ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఆమె చేసే పని ఇదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘తొలి ప్రేమ’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కీర్తి రెడ్డి, ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. ఆమె సినీ జీవితం, వ్యక్తిగత జీవితం మరియు ప్రస్తుత పరిస్థితి గురించి ఈ కథనం వివరిస్తుంది.

Key Points

1

పవన్ కళ్యాణ్ సరసన 'తొలి ప్రేమ'లో నటించి పేరు తెచ్చుకున్నారు.

2

బాలీవుడ్ మరియు కన్నడ చిత్ర పరిశ్రమల్లో కూడా నటించారు.

4

ప్రస్తుతం సింగపూర్ లో నివసిస్తున్నారు మరియు వ్యాపారాలలో రాణిస్తున్నారు.

కీర్తి రెడ్డి సినీ జీవితం

పవర్ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ `తొలి ప్రేమ` చిత్రంతో సంచలనంగా మారింది కీర్తి రెడ్డి. హీరోయిన్‌గా స్టార్‌ అయిపోయింది. ఒక్క మూవీతోనే టాలీవుడ్‌ని షేక్‌ చేసిన కీర్తి రెడ్డి తెలంగాణలోని నిజామాబాద్‌లో జన్మించడం విశేషం.  కానీ ఎక్కువగా ఆమె బెంగుళూరులో పెరిగింది. అక్కడే స్టడీస్‌ కంప్లీట్‌ చేసింది.

1996లో గన్‌షాట్ చిత్రంతో కీర్తి రెడ్డి సినీ రంగ ప్రవేశం చేశారు. 1998లో పవన్ కళ్యాణ్ సరసన ‘తోలి ప్రేమ’లో నటించారు. ఈ మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ లవ్‌ స్టోరీస్‌లో ఎవర్ గ్రీన్‌ గా నిలుస్తుంది. 2000 సంవత్సరంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కీర్తి రెడ్డి Tera Jadoo Chal Gayaa, Pyaar Ishq Aur Mohabbat చిత్రాలలో నటించారు.

వ్యక్తిగత జీవితం మరియు వివాహం

నాగతిహళ్లి చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన `సూపర్‌స్టార్` చిత్రంతో కీర్తి రెడ్డి కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. కన్నడిగులు ఆమెను దేవయానిగా గుర్తిస్తారు. ఉపేంద్ర, కీర్తి రెడ్డి కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది.

కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే కీర్తి రెడ్డి, హీరో సుమంత్‌ను వివాహం చేసుకున్నారు. సుమంత్‌.. నాగార్జున మేనల్లుడు అనే విషయం తెలిసిందే. కొంత కాలం బాగానే ఉన్నా, ఆ తర్వాత సుమంత్‌ నుంచి విడిపోయింది కీర్తిరెడ్డి. వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. వీరి నుంచి విడిపోయిన తర్వాత కొంత గ్యాప్‌తో మరో ఎన్‌ఆర్‌ఐని పెళ్లిచేసుకుంది కీర్తి రెడ్డి. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటున్నారు. అక్కడ వీరికి వ్యాపారాలు, కంపెనీలున్నట్టు సమాచారం. ప్రస్తుతం తనభర్తతోపాటు తాను కూడా ఆ కంపెనీలు చూసుకుంటుంది కీర్తి. బిజినెస్‌ ఉమెన్‌గా రాణిస్తుంది.

ప్రస్తుతం కీర్తి రెడ్డి ఏం చేస్తున్నారు?

కీర్తి రెడ్డి చివరిగా తెలుగులో మహేష్‌ బాబు `అర్జున్` సినిమాలో కనిపించారు.  ఆ తర్వాత ఆమె సినిమాలు దూరమయ్యింది. మళ్లీ రీఎంట్రీ ఇస్తుందనే రూమర్స్ ఆ మధ్య వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలింది. ఇక తెలుగులో కీర్తిరెడ్డి, `గన్ షాట్‌`, `తొలి ప్రేమ`, `ప్రేమించే మనసు`, `రావోయి చందమామ` వంటి చిత్రాల్లో నటించింది.

చివరగా, కీర్తి రెడ్డి తన సినీ జీవితం తర్వాత విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. తన కుటుంబంతో సింగపూర్‌లో సంతోషంగా జీవిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.