|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Toli Prema: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. కల్ట్ మూవీ రీరిలీజ్

Published: 07-06-2025, 7:59 AM
Toli Prema: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. కల్ట్ మూవీ రీరిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 1998లో విడుదలైన ఈ సినిమా యువతను అప్పట్లో బాగా ఆకట్టుకుంది. జూన్ 14న ఈ సినిమా రీరిలీజ్ అవుతోంది.

Key Points

1

పవన్ కల్యాణ్ ‘తొలిప్రేమ’ మూవీ రీరిలీజ్!

2

జూన్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్!

4

పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ వాతావరణం!

తొలిప్రేమ రీరిలీజ్ తేదీ ప్రకటన

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమాల్లో ‘తొలిప్రేమ’కు(Tholi Prema) సపరేట్ బేస్ ఉంటుంది. అప్పట్లో ఈ మూవీ రికార్డులు తిరగరాసింది. పవన్ కల్యాణ్ కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడాదిపైగా థియేటర్లలో ఆడింది. యువతను విపరీతంగా ఆకట్టుకున్నది. తాజాగా ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేయడానికి మేకర్లు సిద్ధమయ్యారు. వచ్చే జూన్ 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఏ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1998 జులై 24వ తేదీన విడుదలైంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది.

పవన్ కల్యాణ్ కెరీర్ లో ఒక మైలురాయి

కాగా, ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్ (Re Release)సినిమాల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలు మరోసారి వెండి తెరపై విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమాలను తిరిగి థియేటర్లో చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలా రీ రిలీజ్ సినిమాలకు మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో వరుసగా స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. జూన్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఖలేజా మూవీ విడుదల కాగా, జులైలో పవన్ కల్యాణ్ తొలిప్రేమను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

రిలీజ్ సినిమాల ట్రెండ్

A post shared by 𝐀𝐧𝐢𝐦𝐚𝐥 𝐏𝐚𝐫𝐤 🦁🦖 (@animal_70mm)

తొలిప్రేమ రీరిలీజ్ తో పవన్ కల్యాణ్ అభిమానులకు మరో సందడి. ఈ సినిమా మళ్ళీ థియేటర్లలో సక్సెస్ అవుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.