
ప్రముఖ టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ హైదరాబాద్‌లో జరుగుతున్న బోనాల పండుగ వేడుకలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తాజా చిత్రం ‘పరదా’ ప్రమోషన్లలో భాగంగా ఈ సందర్శన జరిగింది.
Key Points
టాలీవుడ్ నటి అనుపమ పరమేశ్వరన్ హైదరాబాద్ బోనాల పండుగలో పాల్గొన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయ సిబ్బంది అనుపమకు ప్రత్యేక ఆహ్వానం పలికారు.
అనుపమ పరమేశ్వరన్ బోనాల పండుగకు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) గురించి తెలియని వారు ఉండరు. దాదాపు పది సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో.. కొనసాగుతున్న ఈ బ్యూటీ…అ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈ సినిమాతో పాటు.. ప్రేమమ్ సినిమాలో కూడా ఈ అందాల తార మెరిసింది. కానీ శతమానం భవతి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో… మంచి పేరు సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్.
ఆ తర్వాత ఇండస్ట్రీలో వెనక్కి చూసుకోలేదు. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే, అంటే సుందరానికి, కార్తికేయ2 లాంటి మంచి సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. ఇక ఈ హీరోయిన్ తాజాగా చేసిన సినిమా పరదా. ఇది ఇలా ఉండగా… ప్రస్తుతం హైదరాబాదులో బోనాల పండుగ హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో వారం రోజులపాటు మాత్రమే ఈ పండుగ జరగనుంది.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయ దర్శనం
ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ బోనాల పండుగలో పాల్గొన్నారు హీరోయిన్ అనుపమ. బల్కంపేట ఎల్లమ్మ వారి ఆలయంలో.. అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఈ పరదా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే.. బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు అనుపమ. ఈ సందర్భంగా అనుపమకు.. ఆలయ సిబ్బంది ప్రత్యేక ఆహ్వానం పలికింది.
పరదా సినిమా ప్రమోషన్స్
Team #Paradha visited Balakampet Yallamma Temple for the launch of #YatraNaryasthu Song and sought divine blessings 🙏✨ SECOND SINGLE OUT TODAY at 12 PM 🎼 @anupamahere @darshanarajend @sangithakrish @AnandaMediaOffl @praveenfilms @VijayDonkada @GopiSundarOffl @smayurk … pic.twitter.com/rmoQ3I95nl
బోనాల పండుగ వేళ అనుపమ పరమేశ్వరన్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు పొందిన సంఘటన టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ పండగ వేడుకల్లో భాగంగా ఆమె పాల్గొనడం అభిమానులకు ఆనందాన్నిచ్చింది.


