|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్యాన్సర్‌తో పోరాడుతున్న టాలీవుడ్ నటి.. ఆర్థిక సాయం కోరుతూ ఎమోషనల్ పోస్ట్

Published: 12-12-2025, 4:08 AM
క్యాన్సర్‌తో పోరాడుతున్న టాలీవుడ్ నటి.. ఆర్థిక సాయం కోరుతూ ఎమోషనల్ పోస్ట్
  • టాలీవుడ్ నటి వాహిని (పద్మక్క) అడ్వాన్స్‌డ్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతోంది.
  • ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెకు రూ.35 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
  • కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సాయం కోరుతూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
  • సీనియర్ నటిని ఆదుకోవాలని అభిమానులకు, స్నేహితులకు విజ్ఞప్తి.

టాలీవుడ్ సీనియర్ నటి వాహిని (పద్మక్క) ప్రాణాంతక క్యాన్సర్‌తో పోరాడుతూ ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఆర్థిక సాయం అవసరమని కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

నటి వాహిని పరిస్థితి విషమం: క్యాన్సర్‌తో పోరాటం

టాలీవుడ్ నటీనటుల పరిస్థితి దారుణంగా మారుతుంది. ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. తాజాగా, ఓ సీనియర్ నటి క్యాన్సర్ పోరాడుతూ చికిత్స కోసం ఆర్థిక సాయం కోరుతోంది. ఆ నటి మరెవరో కాదు వాహిని. ఎన్నో సినిమాల్లో, సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ కరాటే కళ్యాణి(Karate Kalyani) సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. పద్మక్క అలియాస్ వాహిని (vahini)టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో చెరగని ముద్ర వేసుకుంది. స్టార్ హీరోలతో నటించిన ఆమె పరిస్థితి దారుణంగా మారింది. కీమోథెరపీ, ఆపరేషన్‌లు చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్: ఆర్థిక సాయం కోరుతూ విజ్ఞప్తి

ఇందుకు దాదాపు రూ.35 లక్షల వరకు ఖర్చు అవుతుందని.. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో సాయం కోసం ఎదురుచూస్తోంది. ఇదే విషయాన్ని తెలుపుతూ కరాటే కళ్యాణి ‘‘అందరికీ నమస్తే.. ఆర్టిస్ట్ జీవితం ఎప్పుడూ ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. మద్రాస్ నడిగర్ సంఘం మెంబర్షిప్ ఉండి తెలుగు సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ వేసి ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పుడప్పుడు సీరియల్స్‌లో మెరుస్తున్న పద్మక్క అలియాస్ వాహిని మా విజయనగరంలో మా పెదనాన్న ఇంటి పక్కనే ఉండేవారు. చిన్నప్పుడు ఆవిడ సినిమాల్లోకి వెళ్లినప్పుడు నేను స్కూల్లో ఉన్నా. కానీ ఈ రోజు ఆ అక్కకి ఇలా క్యాన్సర్ మహమ్మారిసోకి ప్రాణాంతకంగా మారింది.

చికిత్సకు భారీ ఖర్చు: ఆదుకోవాలని విన్నపం

మనంమందరం సహృదయంతో ఎంత తోచితే అంత సహాయం చేద్దాం. ఒక ప్రాణాన్ని కాపాడుకుందాం. తెరపై నటించి మనల్ని అందరినీ అలరించిన ఈ నటిమని కష్టంలో ఉన్నప్పుడు మనందరం ఆదుకోవాల్సి సమయం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం. మీరు కూడా చేయూతనిస్తారని కోరుతూ నా స్నేహితులను, అభిమానులను అభ్యర్థిస్తున్నాను. చేతనైన సహాయం చేయండి. అత్యవసర వైద్య సహాయం కోసం హృదయపూర్వక విజ్ఞప్తి. జయవాహిని గారికి సహాయం చేయండి. ఈ విజ్ఞప్తి మా ప్రియమైన జయవాహిని గారి ప్రాణాలను రక్షించడం కోసం గత కొన్ని నెలలుగా ఆమె అడ్వాన్స్‌డ్-స్టేజ్ రొమ్ము క్యాన్సర్‌తో వీరోచితంగా పోరాడుతున్నారు. దురదృష్ణవశాత్తూ ఆమె ఆరోగ్యం విషమించి అవయవాలు దెబ్బతినడం వల్ల ఆమెకు తక్షణమే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా విరాళాలు పంపవలసిన వివరాలు కూడా జత చేసింది.

తెరపై మనల్ని అలరించిన నటి వాహిని కష్టకాలంలో ఉంది. ఆమె ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరు తమకు తోచిన సహాయం చేసి, మానవత్వాన్ని చాటుకోవాలని ఈ విజ్ఞప్తి కోరుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.