|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దానికోసమే ఇదంతా చేశా.. పబ్ గొడవపై షాకింగ్ విషయం బయటపెట్టిన టాలీవుడ్ బ్యూటీ.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Published: 02-06-2025, 4:56 AM
దానికోసమే ఇదంతా చేశా.. పబ్ గొడవపై షాకింగ్ విషయం బయటపెట్టిన టాలీవుడ్ బ్యూటీ.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

టాలీవుడ్ నటి కల్పిక గణేష్ పుట్టినరోజు వేడుకల్లో పబ్‌లో గొడవ జరిగింది. కేక్ విషయంలో తలెత్తిన వివాదం పోలీసులకు ఫిర్యాదుకు దారితీసింది. తాజాగా కల్పిక చేసిన వ్యాఖ్యలు వివాదానికి తోడయ్యాయి.

Key Points

1

టాలీవుడ్ నటి కల్పిక గణేష్ పుట్టినరోజు వేడుకల్లో పబ్‌లో గొడవ.

2

కేక్ విషయంలో పబ్ యాజమాన్యంతో తగాదా.

4

ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో సబ్‌స్క్రైబర్స్ కోసం ఇదంతా చేశానని కల్పిక వెల్లడి.

కల్పిక గణేష్ పుట్టినరోజు వేడుకలు

టాలీవుడ్ నటి కల్పిక గణేష్Kalpika Ganesh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అల్లు అర్జున్(Allu Arjun), రామ్ చరణ్, వెంకటేష్(Venkatesh), రవితేజ వంటి స్టార్స్ సినిమాల్లో నటించిన ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సమంత యశోద(Yashoda) వంటి చిత్రాలతో ఫుల్ ఫేమ్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. కల్పిక తన పుట్టిన రోజు సందర్భంగా మే 31న ఫేమస్ పబ్‌కు వెళ్లింది. కేక్ కట్ చేసిన తర్వాత స్నేహితులతో కలిసి కాసేపు సమయం గడిపింది.

అయితే కేక్‌కు కాంప్లిమెంటరీగా రావాల్సిన కేక్ విషయంలో పబ్ యాజమాన్యానికి, నటి కల్పికకు గొడవ జరగడంతో ఈ సంఘటన వివాదానికి దారితీసింది. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి గొడవ సద్దుమణిగేలా చూశారు. అయినప్పటికీ ఆమె పబ్ యాజమాన్నంపై గచ్చిబౌలి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తాజాగా, కల్పిక ఇదంతా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పెట్టడానికి కారణాన్ని వెల్లడిస్తూ షాకింగ్ వీడియోను పెట్టింది. అవును సబ్‌స్క్రైబర్స్ కోసమే ఇదంతా చేశాను నాకు కాంట్రవర్సీ కావాలిరా నాయనా.. అని చెప్పడం ఈ వీడియోలో ఉంది. ఇక అది చూసిన నెటిజన్లు సబ్‌స్క్రైబర్స్ ఇదంతా చేసిందా అని కల్పికను తిట్టిపోస్తున్నారు.

పబ్‌లో గొడవ, పోలీసులకు ఫిర్యాదు

సబ్‌స్క్రైబర్స్ కోసమే ఇదంతా చేశానని కల్పిక వెల్లడి

కల్పిక గణేష్ చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సబ్స్క్రైబర్ల కోసం ఇలాంటి వివాదాస్పద చర్యలకు దిగడం సరైనదేనా అనే చర్చ జరుగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.