
📌 Key Points
- సినిమా అవకాశాల కోసం కమిట్‌మెంట్స్ అడుగుతున్నారని కొందరు నటీమణుల ఆరోపణ.
- హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా కమిట్‌మెంట్స్ కోరే వారిలో ఉండొచ్చని సమాచారం.
- కమిట్‌మెంట్స్ గురించి బహిరంగంగా మాట్లాడేందుకు నటీమణులు వెనుకాడుతున్నారు.
- రెమ్యునరేషన్‌లో కమిట్‌మెంట్స్ కూడా కలిపే కౌంట్ చేస్తారని ఇండస్ట్రీలో టాక్.
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే వాదన ఎప్పటి నుంచో ఉంది. అవకాశాల కోసం కమిట్‌మెంట్స్ అడుగుతున్నారని కొందరు నటీమణులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ నిజమా?
Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే మాట క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch). నీకు ఈ హెల్ప్ చేస్తే నాకేంటి? నీకు ఈ అవకాశం ఇస్తే, నాకేం ఇస్తావ్? అని కొందరు.. నీకు అవకాశం ఇస్తాను.. కానీ నాకోసం అది చేయాలి.. అని డైరెక్ట్‌గా అడిగే వారు కొందరు.. ఇలా రకరకాలుగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుకుపోయిందనేది మొదటి నుంచి వినిపిస్తున్న వాదన. ఇందులో కొత్తగా.. కొత్తగా ఏం కాదులే, ఎప్పటి నుంచో ఉన్నదే.. అవకాశం ఇచ్చి, సినిమాకు కన్ఫర్మ్ చేసినప్పుడే ఇన్ని కమిట్‌మెంట్స్ (Commitments) అని.. సినిమాలోని మహిళా నటీమణులైన కొందరికి (అందరికీ కాదు) ఫిక్స్ చేస్తారట. అందుకు ఓకే అంటేనే వాళ్లకి అవకాశం ఇస్తారని, ఇందులో హీరోయిన్లు ఉండొచ్చు, సైడ్ యాక్టర్స్ ఉండొచ్చు, సీనియర్ నటీమణులు కూడా ఉండొచ్చు. ఇక కమిట్‌మెంట్ కోరుకునే లిస్ట్‌లో హీరో, దర్శకుడు, నిర్మాత, సినిమాటోగ్రాఫర్.. ఆఖరికి వీళ్లకి మధ్యవర్తిగా ఉండే పర్సన్ వరకు ఉండొచ్చు అనేలా ఇండస్ట్రీలో బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఇది ఎంత వరకు నిజమనేది వారికే తెలియాలి.
కమిట్‌మెంట్స్ కోరేది ఎవరు?
క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలోనే ఉందని చెప్పలేం. ఇవాల్టీ ప్రపంచంలో ప్రతి చోటా, ప్రతి ఇండస్ట్రీలో ఉంది. ఆఖరికి స్కూల్స్‌లో మగ, ఆడ టీచర్స్ మధ్య కూడా ఎక్కువైపోయింది. కానీ, ఈ కమిట్‌మెంట్స్ అనే పదం మాత్రం ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలోనే వినిపిస్తుంది. పెద్ద పెద్ద హీరోయిన్ల రెమ్యునరేషన్‌తో పాటే ఈ కమిట్‌మెంట్స్ కూడా లింకై ఉంటాయని టాక్ ఉంది. సపోజ్, సినిమాకు రెండు కోట్లు రెమ్యూనరేషన్ అయితే ఆ సినిమా పూర్తయ్యే లోపు దాదాపు నలుగురైదుగురుకి కమిట్‌మెంట్స్ కూడా అందులో కలిపి కౌంట్ చేస్తారట. ఇవన్నీ ఇండస్ట్రీ సైడ్ నుంచే వినిపిస్తుంటాయి. ఇదంతా ఇండస్ట్రీలో ఉంటుందని చాలా మందికి తెలుసు. కానీ, కమిట్‌మెంట్స్ కల్చర్ ఇండస్ట్రీలో (Cinema Industry) ఉన్నా, ఫేస్ చేసినా.. అది పబ్లిగ్గా ఎవరూ చెప్పలేరు. ఒకవేళ ఫేస్ చేసినా.. దాని గురించి మీడియా ముందు ఎవరూ చెప్పరు కూడా. కానీ, ఇండస్ట్రీలో అవకాశం రావాలంటే మాత్రం కమిట్‌మెంట్స్‌ని దాటకుండా వెళ్లడమనేది చాలా రేర్‌గా జరుగుతుంటుంది.
బయటకు రాని నిజాలు ఎందుకు?
కాకపోతే మీడియా, సోషల్ మీడియా, మీటూ వంటివి వచ్చిన తర్వాత చాలా వరకు ఇండస్ట్రీలో ఇలాంటివి తగ్గాయనే చెప్పుకోవాలి. చేతిలో సెల్ ఫోన్ ఉందనో, కెమెరాలు ఉంటాయనో, దొరికితే భవిష్యత్ పోతుందనో, పరువు పోతుందనో.. ఇలా కొన్నిటికి భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. ఏం జరిగినా, ఏం చేసినా.. నటీమణులు మాత్రం మీడియా ముందుకు వచ్చినప్పుడు కొందరు ఇండస్ట్రీలో కమిట్‌మెంట్స్ కల్చర్ ఉంది కానీ, నేనెప్పుడూ అది ఫేస్ చేయలేదు. అలా ఎవరైనా అడిగినా, ప్రవర్తించినా వారికి దూరంగా ఉంటామనే చెబుతుంటారు. ప్రతి ఒక్కరి నోటి నుంచి ఇదే మాట వినిపిస్తుంది. నేను ఫేస్ చేశాను అని మాత్రం ఏ నటీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చెప్పరు. ఇది కూడా రేర్‌గా ఎక్కడో ఒకరు ‘ఫేస్ చేశాను’ అని చెబుతుంటారు. మరి ఫేస్ చేయనప్పుడు ఇండస్ట్రీలో ఉందని చెప్పడం దేనికి? అనేది మాత్రం అర్థం కాదు.
కమిట్‌మెంట్స్ సంస్కృతి టాలీవుడ్‌లో ఉందనేది చాలా మందికి తెలుసు. కానీ దీని గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడటానికి సాహసించరు. దీనిపై మరింత సమాచారం రానున్న రోజుల్లో వెలుగులోకి వస్తుందేమో చూడాలి.


