|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భారతీయ సినిమాకి కేంద్రంగా టాలీవుడ్‌.. జాతీయ అవార్డు విన్నర్స్ కి సీఎం రేవంత్‌ రెడ్డి సత్కారం

Published: 19-08-2025, 2:04 PM
భారతీయ సినిమాకి కేంద్రంగా టాలీవుడ్‌.. జాతీయ అవార్డు విన్నర్స్ కి సీఎం రేవంత్‌ రెడ్డి సత్కారం

71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో అవార్డులు గెలుచుకున్న తెలుగు సినిమా ప్రముఖులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు. హైదరాబాద్‌ను భారతీయ సినిమా కేంద్రంగా నిలబెట్టాలని ఆయన ప్రకటించారు. సినిమా రంగానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు.

Key Points

1

71వ జాతీయ చలన చిత్ర పురస్కార విజేతలను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు.

2

హైదరాబాద్‌ను భారతీయ సినిమా కేంద్రంగా నిలబెట్టాలని సీఎం ప్రకటన.

4

సినిమా రంగానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి.

జాతీయ అవార్డు విజేతలకు సీఎం సత్కారం

ఇటీవల 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో అవార్డులు గెలుచుకున్న తెలుగు సినిమా ప్రముఖులను సీఎం రేవంత్‌ రెడ్డి సత్కరించారు. సోమవారం సాయంత్రం జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో విజేతలను గౌరవించారు రేవంత్‌ రెడ్డి. ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ, భార‌తీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైద‌రాబాద్‌ను నిల‌పాల‌ని అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవ‌స‌ర‌మైన చేయూత‌ను అందిస్తామ‌ని ఆయన తెలిపారు.

71వ జాతీయ ఫిల్మ్ అవార్డ్సుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్ర‌ముఖులు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఆయ‌న నివాసంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సినిమా ప‌రిశ్ర‌మ ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌ను సినీ ప్ర‌ముఖులు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అవార్డు గ్ర‌హీత‌లైన `భ‌గ‌వంత్ కేస‌రి` సినిమా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి, `హ‌నుమాన్` డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌, `హ‌నుమాన్` సినిమాకు విజువ‌ల్ ఎఫెక్ట్ కు సంబంధించి వెంక‌ట్‌, శ్రీనివాస్, టీమ్ స‌భ్యులు, ఫైట్ మాస్ట‌ర్స్ నందు, పృథ్వీ.. `బేబి` సినిమా డైరెక్ట‌ర్ సాయి రాజేశ్‌, సింగ‌ర్ రోహిత్ ల‌ను స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో `హ‌నుమాన్` సినిమా నిర్మాత‌లు చైత‌న్య రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, బేబి సినిమా నిర్మాత ఎస్కేఎన్‌, భ‌గ‌వంత్ కేస‌రి నిర్మాత గార‌పాటి సాహు త‌దిత‌రులు పాల్గొన్నారు.

టాలీవుడ్‌కు ప్రోత్సాహం

ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకున్న “బేబి” సినిమా టీమ్ ను అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. `బేబి` సినిమా నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ ను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించారు. జాతీయ అవార్డ్స్ గెల్చుకున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు.

తమకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిర్మాత ఎస్ కేఎన్, నిర్మాత, దర్శకుడు సాయి రాజేశ్, సింగర్ పీవీఎన్ఎస్ రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న దర్శక, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు సీఎం రేవంత్ రెడ్డి సత్కరించిన వారిలో ఉన్నారు.

సినిమా పరిశ్రమ సవాళ్లు

71 జాతీయ అవార్డ్స్ లో బేబి సినిమా రెండు అవార్డ్స్ గెల్చుకుంది. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) పురస్కారం దక్కించుకున్నారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ గా ప్రేక్షకుల మనసుల్ని గెల్చుకుంది.

జాతీయ అవార్డులతో తెలుగు సినిమా ప్రతిభ ప్రపంచానికి తెలియజేయబడింది. సినిమా రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మరింత మంచి చిత్రాల నిర్మాణం జరుగుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.