
థియేటర్ల సమస్యల నేపథ్యంలో, టాలీవుడ్ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎంలతో మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, చివరి నిమిషంలో ఈ మీటింగ్ రద్దు అయింది.
Key Points
టాలీవుడ్ ప్రముఖులు సీఎం, డిప్యూటీ సీఎంలతో సమావేశం నిర్వహించాలనుకున్నారు.
చివరి నిమిషంలో సమావేశం రద్దు అయింది.
షూటింగ్ షెడ్యూల్స్, అందుబాటులో లేని కీలక వ్యక్తుల కారణంగా రద్దు.
ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం కూడా వాయిదా పడింది.
సమావేశం నిర్వహణకు సన్నాహాలు
Tollywood : ఇటీవల థియేటర్స్ ఇష్యూ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ థియేటర్స్, టాలీవుడ్ పై సీరియస్ అయి టాలీవుడ్ ప్రముఖులు సీఎం ని కలిసారా అని ప్రశ్నించడంతో టాలీవుడ్ పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలవడానికి సిద్ధం అయ్యారు. అధికారికంగా ఏపీ ప్రభుత్వం నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ టాలీవుడ్ లో పలువురికి ఫోన్స్ చేసి మీటింగ్ కి ఆహ్వానించారు కూడా.
నేడు మొదట పవన్ కళ్యాణ్ ని కలిసి అనంతరం పవన్ తో కలిసి సీఎం చంద్రబాబు దగ్గరికి టాలీవుడ్ ప్రముఖులు వెళ్ళాలి. సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసే లిస్ట్ లో డైరెక్టర్ లు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కెవి రామారావు, హీరోలు.. బాలకృష్ణ, వెంకటేష్, మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, నాని.. ఇలా దాదాపు 35 నుంచి 40 మంది ఉన్నారు. నేడు సాయంత్రం సీఎం చంద్రబాబును 4 గంటలకు కలవాల్సి ఉంది.
చివరి నిమిషంలో రద్దుకు కారణాలు
కానీ ఈ మీటింగ్ చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ మీటింగ్ కి రావాల్సిన వారిలో ఎక్కువ మంది షూటింగ్ ల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండడంతో ఈ సమావేశం వాయిదా వేసినట్టు సమాచారం. అలాగే ఈ మీటింగ్ కి రావాల్సిన సినిమా రంగంలోని పలు విభాగాల్లోని ముఖ్యమైన వారు కూడా అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ రద్దు అయినట్టు తెలుస్తుంది.
భవిష్యత్తు సమావేశాలపై అనిశ్చితి
సీఎం, డిప్యూటీ సీఎం ప్రభుత్వం తరపున పిలిచినా టాలీవుడ్ ప్రముఖులు అందుబాటులో లేకపోవడంతో మరింత చర్చగా మారింది. మళ్ళీ ఈ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో చూడాలి. ఇక ఈ మీటింగ్ వాయిదా పడటంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ సమావేశం కూడా వాయిదా పడినట్టు సమాచారం.
చివరి నిమిషంలో సమావేశం రద్దు కావడంతో టాలీవుడ్‌లో ఆందోళన నెలకొంది. భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కోసం మళ్ళీ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.


