|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: టాలీవుడ్ డైరెక్టర్ల పై ఫ్యాన్స్ టార్గెట్! ఇది మామూలు ట్రోలింగ్ కాదుగా!!

Published: 25-03-2026, 1:35 AM
షాకింగ్: టాలీవుడ్ డైరెక్టర్ల పై ఫ్యాన్స్ టార్గెట్! ఇది మామూలు ట్రోలింగ్ కాదుగా!!
  • బాలయ్యకు హిట్స్ ఇచ్చిన బోయపాటిపై అంచనాలు అందుకోలేదని ఫ్యాన్స్ ట్రోలింగ్!
  • ప్రభాస్ ‘రాజాసాబ్’ రిజల్ట్‌తో మారుతిని ఆడుకుంటున్న ఫ్యాన్స్, వేధింపులు ఎక్కువయ్యాయి!
  • ఉస్తాద్ భగత్‌సింగ్‌తో హరీష్ శంకర్‌ను టార్గెట్ చేస్తున్న ఫ్యాన్స్, ఫలితంపైనే భారం!
  • స్టార్ హీరోల ఫ్యాన్స్ ప్రెషర్.. హిట్ ఇస్తే సూపర్, మిస్ అయితే డైరెక్టర్‌పై టార్గెట్ ఫిక్స్!

టాలీవుడ్‌లో ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. తమ హీరోల సినిమాలపై అంచనాలు ఆకాశాన్నంటుతాయి. ఒకవేళ సినిమా తేడా కొడితే, డైరెక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ప్రస్తుతం ఇదే ట్రెండ్ నడుస్తోంది.

బాలయ్య సినిమాతో బోయపాటిపై ట్రోలింగ్స్!

Tollywood : మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌లో ఫ్యానిజం వేరే లెవల్‌. హిట్‌ వస్తే ఎంతలా తలమీద పెట్టుకుంటారో.. తమ అభిమాన హీరోకు ఫెయిల్ వస్తే డైరెక్టర్‌ను అదే రేంజ్‌లో ఆడుకుంటారు. చాలామంది విషయంలో అదే ప్రూవ్ అయింది. తమ అభిమాన హీరోకు సరైన హిట్ ఇవ్వలేదనే కారణంతో డైరెక్టర్లపై.. ఫ్యాన్స్‌ తీరు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్ అవుతోంది. దీంతో స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చిన సంతోషానికి మించి.. ఆ హీరో ఫ్యాన్స్ ఊహించిన లెవల్ హిట్ ఇవ్వకపోతే జరిగే ట్రోలింగ్, బ్యాక్‌లాష్‌ తలుచుకొని డైరెక్టర్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి.

స్టార్ హీరోల సినిమాలపై అభిమానుల అంచనాలు ఆకాశంలో ఉంటున్నాయ్‌. ఆ సినిమా ఫలితం తేడా వస్తే.. ఫ్యాన్స్‌ చేసే హడావుడితో డైరెక్టర్ కెరీర్‌పైనే ఎఫెక్ట్ పడుతోంది. నటసింహం బాలయ్యకు మంచి హిట్స్ ఇచ్చిన రికార్డు ఉంది బోయపాటి శ్రీనుకి ! దీంతో అఖండ 2 మీద ఫ్యాన్స్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ టార్గెట్ మారుతి!

ఐతే ఆ రేంజ్‌లో ఆ మూవీ హిట్ కాలేదు. దీంతో బోయపాటిని సోషల్‌మీడియాలో ట్రోల్ చేశారు. సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్‌తో ప్రభాస్‌కు భారీ హిట్ ఊహించిన ఫ్యాన్స్.. రిజల్ట్ తేడా కొట్టడంతో డిజప్పాయింట్ అయ్యారు. డైరెక్టర్ మారుతిని ఆడుకోవడం మొదలుపెట్టారు.

హరీష్ శంకర్ పరిస్థితి ఏంటి?

ట్రోలింగ్‌ మాత్రమే కాదు.. లిమిట్ దాటేసి వేధించడం మొదలుపెట్టారు ఒకరకంగా ! ఇక ఇప్పుడు ఫ్యాన్స్ టార్గెట్‌లోకి హరీష్ శంకర్ వచ్చేశాడు. ఉస్తాద్ భగత్‌సింగ్‌ మూవీకి ముందు హరీష్ శంకర్ చుట్టూ కూడా ఇదే చర్చ జరిగింది. ఫైనల్ రిజల్ట్‌ డిసైడ్ చేస్తుంది.. ఫ్యాన్స్ ఎలా ఉంటారని ! ఇలా స్టార్ హీరోల ఫ్యాన్స్ ప్రెషర్.. డైరెక్టర్లను ఇబ్బంది పెడుతోంది. హిట్ ఇస్తే సూపర్.. మిస్ అయితే టార్గెట్‌ ! ఇదో ట్రెండ్ అయిపోయిందంటూ డైరెక్టర్లు ఫీల్ అవుతున్నారట.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. ఫ్యాన్స్ టార్గెట్ నుండి ఏ డైరెక్టర్లు తప్పించుకుంటారో చూడాలి. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.