
📌 Key Points
- సంగీత్ శోభన్ చేసిన పని వైరల్! డైరెక్టర్ చున్నీతో కళ్లద్దాలు తుడుచుకున్నాడు.
- ఏప్రిల్ 3న రాకాస మూవీ రిలీజ్! ప్రమోషన్స్‌లో చిత్ర బృందం ఫుల్ బిజీ.
- నిహారిక కొణిదెల నిర్మాతగా రాకాస మూవీ! సంగీత శోభన్ హీరోగా నయన్ సారిక హీరోయిన్.
- నెటిజన్ల కౌంటర్ ఎటాక్! చున్నీ పట్టుకునే ముందు పర్మిషన్ తీసుకోవాలంటూ కామెంట్స్.
టాలీవుడ్ లో సరికొత్త సంఘటన! రాకాస మూవీ ప్రమోషన్స్ లో హీరో సంగీత్ శోభన్ చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వార్త చదవండి!
హీరో చేసిన పని వైరల్ ఎందుకు?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పెద్ద హీరోలవి కొన్ని సినిమాలు ఉంటే.. మరికొంతమంది చిన్న హీరోలు కూడా డిఫరెంట్ కథలతో వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంగీత శోభన్… రాకాస అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తుండగా నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో సంగీత శోభన్ సరసన నయన్ సారిక హీరోయిన్ గా చేస్తున్నారు. ఇక ఈ మూవీలో వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి లాంటి కీలకమైన వాళ్లు ఉన్నారు. ఏప్రిల్ మూడవ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో దూసుకు వెళ్తోంది చిత్ర బృందం.
నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉంది?
అయితే ఈ సందర్భంగా హీరో సంగీత్ శోభన్ స్టేజ్ పైన చేసిన పని వైరల్ గా మారింది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ కు వెళ్లిన హీరో సంగీత్ శోభన్, లేడీ డైరెక్టర్ మానస శర్మ చున్నీతో తన కళ్లద్దాలు తుడుచుకున్నాడు. ఆమెను నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే సంగీత శోభన్ ఈ పని చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో అమ్మాయిల చున్ని పట్టుకునే ముందు పర్మిషన్ తీసుకోవాలని హీరోకు కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్స్. లేడీ డైరెక్టర్ మానస శర్మ మంచి వ్యక్తి కాబట్టి సైలెంట్ గా ఉన్నారు.. వేరే మహిళ అయితే కచ్చితంగా ఈ సంఘటన వివాదంగా మారేదని మరికొంతమంది వాదిస్తున్నారు.
రాకాస మూవీ విశేషాలు ఏంటి?
A post shared by J Caleb’s (@jcreativs)
సంగీత్ శోభన్ చేసిన పని సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. రాకాస మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


