|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి మూవీ బ్లాక్ బస్టర్ హిట్! టాలీవుడ్ హీరో షాకింగ్ ట్వీట్ వైరల్!

Published: 12-01-2026, 3:00 AM
చిరంజీవి మూవీ బ్లాక్ బస్టర్ హిట్! టాలీవుడ్ హీరో షాకింగ్ ట్వీట్ వైరల్!
  • చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మూవీ బ్లాక్ బస్టర్ టాక్!
  • విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో అదరగొట్టారు, ఫ్యాన్స్ ఫిదా!
  • కిరణ్ అబ్బవరం ట్వీట్: ‘ఆ స్వాగ్, స్టైల్ మళ్ళీ చూశాం’!
  • అనిల్ రావిపూడి దర్శకత్వానికి ప్రేక్షకులు జేజేలు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మూవీ రిలీజ్ అయింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బ్లాక్ బస్టర్ అంటున్నారు. టాలీవుడ్ హీరోలు కూడా సినిమాపై తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

బాస్ ఈజ్ బ్యాక్: దుమ్మురేపిన చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu) సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయి మార్నింగ్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక చిత్రాన్ని అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార, క్యాథరిన్ హీరోయిన్లుగా.. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించారు.

అయితే ఈ సినిమా చూసిన ఆడియన్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టాడు. ‘ఆ స్వాగ్ .. స్టైలూ .. ఆ టైమింగు ..మళ్లీ చూసాం.. నిన్న రాత్రి ఇవన్ని ఇంతలా ఉంటుంది అని తెలియక నార్మల్‌గా థియేటర్లోకి వెళ్లాం.. ఇప్పుడు పక్కా ప్లాన్డ్‌గా పేపర్స్ తో వెళ్దాం.. అనిల్ రావిపూడి అన్నా.. చిరంజీవి.. వెంకీ మామ సార్ ఆ ఇంటర్వెల్ షాట్.. రఫాడించారు’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతంఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అనిల్ రావిపూడి మ్యాజిక్: ఫ్యాన్స్ ఫిదా!

కిరణ్ ట్వీట్: వైరల్ అవుతున్న కామెంట్స్!

చిరంజీవి సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.