
📌 Key Points
- ఒకప్పుడు థియేటర్ల ఆధారంగా విజయం, ఇప్పుడు కలెక్షన్లే కీలకం
- 100 కోట్ల క్లబ్‌లో దూసుకుపోతున్న యంగ్ హీరోలు
- బాలకృష్ణ, నాగార్జునలకు అందని ద్రాక్షగా 100 కోట్ల మార్క్
- బాలయ్య కొత్త సినిమాలతో అయినా ఈ ఫీట్ అందుకుంటారా అనేది ప్రశ్న
టాలీవుడ్‌లో హీరోల విజయానికి ఒకప్పుడు థియేటర్లే గీటురాయి. కానీ ఇప్పుడు కలెక్షన్లదే హవా. యంగ్ హీరోలు దూసుకుపోతుంటే.. బాలకృష్ణ, నాగార్జున మాత్రం 100 కోట్ల మార్క్ కోసం ఎదురుచూస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలిస్తాయా?
మారుతున్న టాలీవుడ్ లెక్కలు
Tollywood:ఒకప్పుడు హీరోల విజయం అంటే వారి సినిమాలు ఎన్ని థియేటర్లలో ఎన్ని రోజులు ప్రదర్శించబడ్డాయి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఏ హీరో ముందుగా అత్యధిక కలెక్షన్లు రాబడుతున్నారు అనే విషయాలపైనే ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యకాలంలో రూ.100 కోట్ల మార్క్ బెంచ్ అనేది అందరికీ అత్యవసరంగా మారిపోయింది. ఒకప్పుడు రూ.50 కోట్ల షేర్ రాబడితే చాలు ఆ హీరోలు స్టార్ హీరోలుగా చలామణి అయ్యేవారు. కానీ మా కాలం మారుతున్న కొద్దీ యంగ్ హీరోలు కూడా ఈ మార్కును అవలీలగా దాటేస్తుంటే.. ఆ ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం ఇంకా ఆ మార్కును అందుకోకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
ఇకపోతే ఈతరం హీరోలైన రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun), ఎన్టీఆర్ (NTR) , ప్రభాస్(Prabhas ), మహేష్ బాబు (Maheshbabu) లాంటి హీరోలు రూ.100 కోట్ల షేర్ రాబట్టడం వారికి మరింత సులభంగా మారిపోయింది. దీనికి తోడు ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయినా భారీ కలెక్షన్స్ వసూల్ చేస్తూఈ. ఈ సినిమా కూడా అప్పుడే వందకోట్ల షేర్ రాబట్టి కమర్షియల్ గా విజయం సాధించింది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా 100 కోట్ల షేర్ మార్కు దాటేసి సంచలనం సృష్టించింది.
100 కోట్ల క్లబ్‌లో యంగ్ హీరోల హవా
ఇక అంతేకాదు యంగ్ హీరోగా పేరు దక్కించుకున్న తేజ సజ్జ కూడా ‘హనుమాన్’ చిత్రంతో ఈ మార్క్ అందుకొని అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. అలా చిన్న హీరోలు కూడా ఈ 100 కోట్ల షేర్ రాబడుతూ రికార్డు సృష్టిస్తుంటే.. నాగార్జున(Nagarjuna), బాలకృష్ణ (Balakrishna) మాత్రం ఆ బెంచ్ మార్కుకి చేరువలోకి వెళ్తున్నారే కానీ దానిని అందుకోవడం కష్టంగా మారిపోయింది. ముఖ్యంగా బాలకృష్ణ అఖండ, డాకూ మహారాజ్ చిత్రాలతో ఈ మార్కును అందుకుంటారు అనుకున్నారు. కానీ 70 కోట్ల షేర్ వరకు రాబట్టి అక్కడే ఆగిపోయారు. పైగా ఇటీవల వచ్చిన అఖండ ఈ సినిమాతో రీచ్ సాధిస్తారు అని అనుకున్నప్పటికీ అది కూడా కుదరలేదు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అలాగే ఆదిత్య 369 సీక్వెల్ లో కూడా బాలకృష్ణ నటిస్తున్నారు. కనీసం ఈ రెండు చిత్రాలతోనైనా బాలయ్య ఈ మార్కును టచ్ చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
వెనుకబడుతున్న సీనియర్ హీరోలు
నాగార్జున.. ఇప్పటివరకు స్టార్ హీరోగా ప్రేక్షకులను అలరించిన ఈయన గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సరిపెట్టుకుంటున్నారు. హీరోగా సినిమా చేయాలి అని , ఆ 100 కోట్ల షేర్ మార్కును అందుకొని, ఆయన కూడా ఈ జాబితాలోకి చేరిపోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే తన 100వ సినిమాతో ఈ మార్కును బీట్ చేయడానికి సిద్ధమయ్యారు నాగార్జున. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వంలో తన 100వ సినిమా కోసం సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాతో కచ్చితంగా ఈ మార్కు అందుకుంటారని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నాగార్జున, బాలకృష్ణ మాత్రమే మిగిలి ఉన్నారు. వీరిద్దరూ కూడా ఈ మార్కు టచ్ చేయాలని అభిమానులు, అటు ఇండస్ట్రీ వర్గాలు కూడా అభిప్రాల వ్యక్తం చేస్తున్న.
మొత్తానికి బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ హీరోలు ఈ 100 కోట్ల మార్కును ఎప్పుడు అందుకుంటారో చూడాలి. భవిష్యత్తులో వారి సినిమాలు ఈ బెంచ్ మార్క్‌ను చేరుతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.


