
ప్రభాస్ నటించే ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొరియా సూపర్ స్టార్ డాన్ లీ ఈ సినిమాలో నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తరుణ్, శ్రీకాంత్ లతో ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Key Points
ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.
కొరియా సూపర్ స్టార్ డాన్ లీ 'స్పిరిట్'లో విలన్ పాత్రలో నటించే అవకాశం ఉంది.
తరుణ్ మరియు శ్రీకాంత్ లు డాన్ లీతో ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.
'స్పిరిట్' సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది.
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా అప్డేట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) వరుస సినిమాలతో తీరిక లేకుండా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో త్రిప్తి డిమ్రి(Tripti Dimri) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ‘స్పిరిట్’(Spirit) నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఈ మూవీలో దక్షిణ కొరియా సూపర్ స్టార్ డాన్ లీ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆయన గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ హీరోలతో ఓ పోజు పెట్టి ఫొటోలు తీసుకుంటున్నారు.
గత కొద్ది రోజుల క్రితం లవర్ బాయ్ టాలీవుడ్ హీరోయిన్ తరుణ్, డాన్ లీ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్‌తో కూడా డాన్ లీ అదే పోజు పెట్టి ఫొటో దిగడం గమనార్హం. ఇలా ఈ ఇద్దరు హీరోలు వరుసగా ఆయనతో ఫొటోలు దిగడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ‘స్పిరిట్’ సినిమాలో డాన్ లీతో పాటు తరుణ్, శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొందరు నెటిజన్లు నీ ప్లాన్ అదిరిపోయింది సందీప్ రెడ్డి అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి టి-సిరిస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
డాన్ లీ, తరుణ్, శ్రీకాంత్ ఫోటోలు వైరల్
‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ప్రారంభం
తరుణ్, శ్రీకాంత్ లతో డాన్ లీ ఫోటోలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ‘స్పిరిట్’ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాలను ఏర్పరుస్తోంది.


