
📌 Key Points
- స్మృతి మందాన తరహాలో నివేదా పేతురాజ్ పెళ్లి రద్దు వార్తలు.
- రాజ్ హిత్ ఇబ్రాన్‌తో నివేదా నిశ్చితార్థం చేసుకున్న సంగతి.
- ఎంగేజ్‌మెంట్ ఫోటోలను తొలగించి, ఒకరినొకరు అన్-ఫాలో చేసుకున్న జంట.
- వివాహం రద్దుపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం.
స్మృతి మందాన పెళ్లి రద్దు తర్వాత, టాలీవుడ్ నటి నివేదా పేతురాజ్ వివాహం కూడా రద్దయినట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్‌తో నిశ్చితార్థం చేసుకున్న నివేదా, ఎంగేజ్‌మెంట్ ఫోటోలను తొలగించి, ఒకరినొకరు అన్-ఫాలో చేసుకుంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
స్మృతి మందాన తరహాలో నివేదా పెళ్లి రద్దు?
భారత మహిళల జట్టుకు చెందిన స్మృతి మందాన పెళ్లి ఇటీవల రద్దయిన సంగతి తెలిసిందే. పలాష్ ముచ్చల్ అసలు చీకటి వ్యవహారం బయటపడడంతో తన పెళ్లిని చాలా తెలివిగా స్మృతి మందాన రద్దు చేసుకున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే స్మృతి మందాన తరహాలోనే ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి కూడా రద్దయినట్లు సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు విశ్వక్ సినిమాల్లో ఎక్కువగా కనిపించే నివేదా పేతురాజ్ ( Nivetha Pethuraj ).
రాజ్ హిత్ ఇబ్రాన్‌తో నివేదా నిశ్చితార్థం వివరాలు
ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ హిత్ ఇబ్రాన్ తో ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ నివేదా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇద్దరు క్లోజ్ గా దిగిన ఫోటోలను కూడా పంచుకున్నారు. డిసెంబర్ లోగా పెళ్లి జరుగుతుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇంతలోనే ఈ జంట గురించి ఇప్పుడు షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో వార్తలు – అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు
నివేదా, రాజ్ హిత్ ఇబ్రాన్ వివాహం రద్దయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ ఫోటోలను నివేదా తొలగించారట. ఒకరినొకరు అన్ ఫాలో కూడా చేసుకున్నారట. దీంతో వీళ్ళ వివాహం రద్దయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. రెండు, మూడు రోజుల్లో దీనిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్త వైరల్ అవుతోంది.
నివేదా పేతురాజ్ వివాహం రద్దు వార్తలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అభిమానులు ఈ విషయంపై ఎదురుచూస్తున్నారు.


