
టాలీవుడ్ నటి రీతు వర్మ తాజా వెబ్ సిరీస్ ‘దేవిక అండ్ డానీ’ ప్రమోషన్లో భాగంగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి కన్నీటితో పంచుకుంది.
Key Points
టాలీవుడ్ హీరోయిన్ రీతు వర్మ 'పెళ్లి చూపులు'తో ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా 'దేవిక అండ్ డానీ' వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.
ప్రెస్ మీట్లో ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకుంది.
అమ్మాయిలను చులకనగా చూసేవారికి ఈ సిరీస్ స్ఫూర్తినిస్తుందని పేర్కొంది.
రితు వర్మ ఎమోషనల్ స్పీచ్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రీతు వర్మ(Rithu Verma) ‘పెళ్లి చూపులు’చిత్రంతో ఎంట్రీ ఇచ్చి హిట్ అందుకుంది. దీంతో అమ్మడుకి వరుస అవకాశాలు వచ్చాయి. అలా టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించిన ఈ భామ ఫేమ్ తెచ్చుకుంది. హిట్స్, ఫ్లాప్స్ అని చూడకుండా వచ్చిన సినిమా అవకాశాలు ఒప్పుకుంటూ గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇటీవల ‘మజాకా’ (Mazaka)మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది.
ప్రస్తుతం రితూ వర్మ సరికొత్త ప్రయాణం ప్రారంభించనుంది. వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె ‘దేవిక అండ్ డానీ’(Devika and Danny) వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అయితే ఇందులో సూర్య విశిష్ట (Surya Vishishtha)హీరోగా నటిస్తుండగా.. దీనిని శ్రీకారం ఫేమ్ కిశోర్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో శివ కందుకూరి, సుబ్బరాజు, మోనిక రెడ్డి, సోనియా సింగ్, చాగంటి సుధాకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సిరీస్ జియోహాట్‌స్టార్‌లో జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, చిత్రబృందం ప్రెస్‌మీట్ పెట్టగా ఇందులో పాల్గొన్న రీతు వర్మ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘చాలాసార్లు మన చుట్టుపక్కల ఉన్నవారు మనకు చెప్తుంటారు.
‘దేవిక అండ్ డానీ’ వెబ్ సిరీస్
నువ్వు అది చేయలేవు, ఇలా ఉండాలి అలా ఉండాలని కండీషన్లు పెడతారు. అలాగే కొంతమంది చులకనగా చూస్తారు. ఇలాంటి అనుభవాలు అమ్మాయిలకే ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారందరికీ ఈ వెబ్ సిరీస్ స్ఫూర్తినిస్తోంది అలాగే మంచి జీవితాన్ని పొందడానికి సహాయపడుతుంది. మా వెబ్‌సిరీస్ ఎంతోమందికి నమ్మకాన్ని, బలాన్ని అందిస్తుందని నేను నమ్ముతున్నాను’’ అని స్టేజ్‌పైనే కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్
https://x.com/greatandhranews/status/1929840714533531744
చివరగా, రీతు వర్మ తన అనుభవాలను పంచుకోవడం ద్వారా అనేక మంది అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చింది. ‘దేవిక అండ్ డానీ’ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన వస్తుందని ఆశిద్దాం.


