
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే, తాజాగా పార్లే-జీ బిస్కెట్ తింటున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియో నెటిజన్లలో చర్చకు దారితీసింది.
Key Points
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల సంచలన వీడియోను పంచుకుంది.
పార్లే-జీ బిస్కెట్ తింటున్న వీడియోను ఆమె పోస్ట్ చేసింది.
నెటిజన్లు ఆమెకు సినిమా అవకాశాలు లేకపోవడంపై వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.
పూజా హెగ్డే సినిమాల్లో కనిపించకపోవడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పూజా హెగ్డే వైరల్ వీడియో
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది అతి తక్కువ కాలంలోనే పాపులరై… దూసుకు వెళ్తూ ఉంటారు. మరి కొంతమంది మంచి మంచి సినిమాలు చేసి ఆ తర్వాత డీలా పడిపోతూ ఉంటారు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగి ఇప్పుడు.. చేతిలో సినిమాలు లేకుండా సతమతమవుతున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు.
అలా వైకుంఠపురం సినిమాలో మెరిసిన తర్వాత మళ్లీ తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు పూజా హెగ్డే. బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే తమిళ్ ఇండస్ట్రీలో.. అడపాదడపా ఛాన్సులు వస్తున్నాయి. కానీ పెద్ద హీరో సినిమాలో మాత్రం చాన్సులు దక్కించుకోలేకపోతోంది ఈ బ్యూటీ. అయితే అలాంటి హీరోయిన్ పూజ హెగ్డే ఇప్పుడు సంచలన వీడియో పంచుకుంది. పార్లేజీ బిస్కెట్ ను చాయిలో… వేసుకొని తింటూ కనిపించింది పూజ హెగ్డే.
నెటిజన్ల ప్రతిస్పందనలు
సింపుల్ లైఫ్… చాయ్ తో బిస్కెట్ అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఈ సింపుల్ లైఫ్ తోనే తనకు ఆనందంగా ఉందని.. పేర్కొంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజెన్స్… రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పాపం పూజా హెగ్డే చేతిలో సినిమాలు లేక పార్లేజి బిస్కెట్ తినాల్సిన పరిస్థితి వచ్చిందని సెటైర్లు పేల్చుతున్నారు. ఈ పరిస్థితి చూసైనా.. ఎవరో ఒకరు ఆమెకు మళ్ళీ లైఫ్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా పూజా హెగ్డే… ఆచార్య తరువాత తెలుగు సినిమాలే చేయలేదు.
సినిమా అవకాశాల కొరత
A post shared by Pooja Hegde (@hegdepooja)
పూజా హెగ్డే వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమెకు త్వరలోనే మంచి అవకాశాలు లభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సంఘటన టాలీవుడ్‌లో చర్చకు దారితీసింది.


