|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆరేళ్ల సీక్రెట్ లవ్, ఇద్దరు పిల్లలు: 53 ఏళ్ల నటుడితో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి!

Published: 16-12-2025, 1:06 AM
ఆరేళ్ల సీక్రెట్ లవ్, ఇద్దరు పిల్లలు: 53 ఏళ్ల నటుడితో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి!
  • గాబ్రియెల్లా డెమిట్రియాడ్స్ ‘ఊపిరి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించి జెన్నీ పాత్రతో ఆకట్టుకుంది.
  • అర్జున్ రాంపాల్‌తో ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న గాబ్రియెల్లా, పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.
  • 53 ఏళ్ల అర్జున్ రాంపాల్‌కు ఇది రెండో పెళ్లి, గాబ్రియెల్లా వయసు 38 – వీరి మధ్య 15 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది.
  • తాజాగా, అర్జున్ రాంపాల్ రియా చక్రవర్తి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తమ నిశ్చితార్థం, పెళ్లి గురించి వెల్లడించారు.

టాలీవుడ్ నటి గాబ్రియెల్లా డెమిట్రియాడ్స్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ పెళ్లి వార్త సంచలనం సృష్టిస్తోంది. ఆరేళ్ల ప్రేమ, ఇద్దరు పిల్లల తర్వాత వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న వీరి వయసు వ్యత్యాసం, రహస్య సంబంధం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

గాబ్రియెల్లా సినీ ప్రస్థానం, అర్జున్ రాంపాల్‌తో పరిచయం

టాలీవుడ్ బ్యూటీ గాబ్రియెల్ల (Gabriella)వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. ఆ అమ్మడు 16 ఏళ్లకే మోడల్‌గా‌ కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత భారత్‌కి వచ్చి అక్కినేని నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రలో నటించిన ‘ఊపిరి’ మూవీతో సినీ ఇండస్ట్రీకి వచ్చింది. ఇందులో ఫ్రెంచ్ డ్యాన్సర్ జెన్నీగా కనిపించిన గాబ్రియెల్లా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఈ అమ్మడు అర్జున్ రాంపాల్‌(Arjun Rampal)తో కలిసి ‘ఇష్క్ ఝుమేలా’లో కనిపించింది. ఇక అప్పటి నుంచి ఆయనతో ప్రేమలో ఉన్న గాబ్రయెల్ల సీక్రెట్‌గా లివింగ్ రిలేషన్‌ను కొనసాగిస్తోంది. 2019నుంచే డేటింగ్ చేస్తున్న ఈ జంట ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.

వీరిద్దరు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ ఎక్కడా కూడా తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఇక అర్జున్ రాంపాల్ విషయానికొస్తే.. హ్యాండమ్ విలన్‌గా వరుస చిత్రాలతో మెప్పిస్తున్నాడు. ఇటీవల ‘ధురంధర్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. తాజాగా, సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి పాడ్’కాస్ట్ ఇంటర్వ్యూకు వచ్చిన అర్జున్ రాంపాల్ తన రిలేషన్‌షిప్ గురించి వెల్లడించి అందరినీ షాక్‌కు గురి చేశాడు. గాబ్రియెల్లతో తనకు నిశ్చితార్ధం జరిగిపోయిందని వెల్లడించాడు. త్వరలోనే వీరిద్దరు వివాహ బంధంలోకి కూడా అడుగుపెట్టుబోతున్నారని సమాచారం.

రహస్య ప్రేమాయణం.. పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలు

కాగా.. ఇది అర్జున్ రాంపాల్‌కు రెండో పెళ్లి కావడం గమనార్హం. ఇప్పటికే మోడల్, నిర్మాత మెహర్ జెసియాను పెళ్లి చేసుకోగా.. మనస్పర్థలు రావడంతో 2018లో విడిపోయారు. ఇక అప్పటినుంచి గాబ్రియెల్లతో డేటింగ్‌లో ఉన్నాడు. ఇక అర్జున్ వయసు 53 సంవత్సరాలు కాగా.. గాబ్రియెల్ల డెమిట్రియాడ్స్ ది మాత్రం 38మాత్రమే. అయితే వీరిద్దరి మధ్య ఏకంగా 15 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మరీ ముఖ్యంగా వీరు పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలను కనడంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు.

ఏజ్ గ్యాప్ షాకింగ్.. త్వరలో పెళ్లి పీటల మీదకు!

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

ఆరేళ్ల ప్రేమ, ఇద్దరు పిల్లలు, అలాగే చెప్పుకోదగ్గ వయసు అంతరం.. ఈ విషయాలన్నీ అర్జున్-గాబ్రియెల్లా పెళ్లిని మరింత ఆసక్తికరంగా మార్చాయి. వారి వివాహ బంధం బలపడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.