|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విల‌న్ పాత్ర‌లో టాలీవుడ్ హీరోయిన్‌..ఇక ర‌చ్చ ర‌చ్చే !

Published: 29-09-2025, 10:34 AM
విల‌న్ పాత్ర‌లో టాలీవుడ్ హీరోయిన్‌..ఇక ర‌చ్చ ర‌చ్చే !

టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి మీనాక్షి చౌదరి ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో విలన్ పాత్రకు ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ నెగిటివ్ రోల్ ఆమె కెరీర్‌కు పెద్ద బూస్ట్ ఇస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Key Points

1

మీనాక్షి చౌదరి బాలీవుడ్‌లో విలన్ పాత్రలో కనిపించనుంది.

2

ఈ నెగిటివ్ రోల్ ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ కానుందని అంచనా.

4

బాలీవుడ్‌లో 'ఫోర్స్ 3' తర్వాత ఇది ఆమె రెండో ముఖ్యమైన ప్రాజెక్ట్.

మీనాక్షి చౌదరి కెరీర్ ప్రస్థానం

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ కొంతమంది హీరోయిన్లు ఒకటి లేదా రెండు సినిమాలతోనే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary ) ఒకరు. ఈ పొడుగు కాళ్ళ సుందరి… హర్యానా నుంచి వచ్చి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ బ్యూటీ… గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి బంపర్ హిట్ సినిమాలు అందుకున్నారు.

బాలీవుడ్‌లో విలన్ పాత్ర అవకాశం

దీంతో తెలుగులో మరిన్ని అవకాశాలు ఆమెకు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు కూడా ఆమె వెళ్తున్నారు. ప్రస్తుతం ఫోర్స్ 3 సినిమాలో మీనాక్షి చౌదరి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ సినిమా తర్వాత… మరో సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేందుకు మీనాక్షి చౌదరి సిద్ధమైనట్లు చెబుతున్నారు. బాలీవుడ్ లో త‌న సెకండ్ సినిమాలో విల‌న్ పాత్ర ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. ఈ మేర‌కు ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. ఆ నెగిటివ్ పాత్ర చేస్తే.. మీనాక్షి చౌద‌రి కెరీర్ ఓ రేంజ్ కు వెళుతుంద‌ట‌. ఈ సినిమాపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌.

ఈ పాత్రతో కెరీర్ మలుపు

A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006)

మీనాక్షి చౌదరి విలన్ పాత్రతో బాలీవుడ్‌లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ ప్రత్యేక పాత్ర ఆమెకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టి, ఆమె కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆశిద్దాం. ఈ వార్త ఆమె అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.