|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: మూడేళ్లుగా నరకం చూపిస్తున్నాడు! టాలీవుడ్ హీరోయిన్ సంచలన ఆరోపణలు!

Published: 06-02-2026, 12:35 AM
షాకింగ్: మూడేళ్లుగా నరకం చూపిస్తున్నాడు! టాలీవుడ్ హీరోయిన్ సంచలన ఆరోపణలు!
  • నటి రవీనా రవి ఆన్‌లైన్‌లో వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించింది.
  • మూడేళ్లుగా సబరీష్ అనే వ్యక్తి, అతని సోదరులు వేధిస్తున్నారని ఆరోపణ.
  • కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని తెలిపింది.
  • పోలీసులకు ఫిర్యాదు చేసినా వేధింపులు ఆగలేదని రవీనా రవి ఆవేదన వ్యక్తం చేసింది.

టాలీవుడ్ నటి రవీనా రవి గత మూడేళ్లుగా ఆన్‌లైన్ వేధింపులు ఎదుర్కొంటున్నట్లు సంచలన ఆరోపణలు చేసింది. సబరీష్ అనే వ్యక్తి తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నాడని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

రవీనా రవి ఆవేదన

Tollywood:సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్లు కాబట్టి జనాల్లోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా తమను తాము కాపాడుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొంతమంది ఆకతాయిలు సెలెబ్రిటీలు కనిపిస్తే చాలు ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. వారితో కరచాలనం చేయాలి అని, వారితో ఫోటోలు దిగాలనే అభిమానులు కొంతమంది అయితే.. మరి కొంతమంది వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈమధ్య ఆన్లైన్ వాడకం పెరిగిపోయిన తర్వాత చాలామంది సెలబ్రిటీలను అత్యంత దారుణంగా మానసికంగా వేధిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక టాలీవుడ్ హీరోయిన్ ఆన్లైన్ ద్వారా మూడేళ్లుగా నరకం చూస్తున్నాను అంటూ స్క్రీన్ షాట్లతో సహా బయటపెట్టి తన బాధను వ్యక్తపరిచింది. మరి ఆమె ఎవరు ? అసలేం జరుగుతోంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది రవీనా రవి(Raveena Ravi).నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. సౌత్ సినీ భాషలలో డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేస్తూ అటు నటిగా కూడా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఓకే బంగారం, ప్రేమమ్, నవాబ్ వంటి చిత్రాలలో నటించింది. అలాంటి ఈమె తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. గత మూడు సంవత్సరాలుగా ఒక వ్యక్తి తనను, తన కుటుంబ సభ్యులను, సన్నిహితులను వేధిస్తున్నాడు అని, తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు తన బాధను సోషల్ మీడియాలో పంచుకుంది.

మూడేళ్లుగా వేధింపులు

గత మూడు సంవత్సరాలుగా నన్ను ఒక వ్యక్తి వేధిస్తున్నాడు. ముఖ్యంగా నా కుటుంబాన్ని, స్నేహితులను రక్షించుకోవడానికి.. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ పోస్ట్ పెడుతున్నాను. పోలీసులకు ఫిర్యాదు చేసి, హెచ్చరిక దాఖలు చేస్తే ఆగిపోతుంది అనుకున్నాను. కానీ సబరీష్ అనే వ్యక్తి , అతని ఇద్దరి సోదరులు నన్ను నా కుటుంబాన్ని నిరంతరం వేధిస్తున్నారు. వరుస కామెంట్లతో నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులను కూడా అసభ్యకరమైన పదజాలాలతో దూషిస్తున్నారు. వివిధ ఖాతాలను ఉపయోగించి వేధించడం మొదలుపెట్టారు. ఇప్పటికే పరిచయం ఉన్నవారని నాతో నిశ్చితార్థం జరిగిందని చెబుతున్నారు. ముఖ్యంగా కొందరు నటీమణులను కూడా వీరు వేధిస్తున్నారు అంటూ ఆమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా రాసుకుంది. అందుకే ఎవరికైనా ఇలా జరిగితే ముందస్తుగా తమ ప్రొఫైల్ ను బ్లాక్ చేయమని , వారి కామెంట్స్ కు రియాక్ట్ అవ్వకుండా ఉండాలని ఆమె కోరింది. ఇక ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులపై తనకు నమ్మకం ఉందని, తప్పకుండా తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటే రవీనా రవి తెలిపింది. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతోంది .అటు అధికారులు.హెచ్చరికలు జారీ చేసిన ఆకతాయిలు మాత్రం వారి పద్ధతులను మార్చుకోకపోవడం సభ్య సమాజానికి సిగ్గుచేటు అంటూ సదరు నేటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags Raveena Ravi tollywood Share

రవీనా రవి తన బాధను సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.