
టాలీవుడ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీ లీల తాజాగా విశాఖపట్నం సందర్శించి అభిమానులను పలకరించారు. ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ లీల అక్కడ తన అభిమానులకు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చారు.
Key Points
శ్రీ లీల విశాఖలో షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో పాల్గొన్నారు.
పట్టుచీరలో అందంగా కనిపించిన శ్రీ లీల అభిమానులకు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చారు.
అగ్గిపెట్ట పట్టుచీరను ఆవిష్కరించారు.
విశాఖకు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు.
విశాఖలో శ్రీలీల సందడి
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రీ లీలకు (Sreeleela) ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్ శ్రీ లీల… రవితేజ, ప్రిన్స్ మహేష్ బాబు, హీరో నితిన్ లాంటి బడా స్టార్ హీరోలతో… సినిమాలు చేశారు. మరి కొన్ని సినిమాలు కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇటు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసింది.
షాపింగ్ మాల్ ఓపెనింగ్
ఇలా అవకాశాలు ఎక్కడ అవకాశాలు వచ్చినా.. సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. సినిమా విఫలమైన కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ఈ అందాల తార శ్రీ లీల. అయితే అలాంటి హీరోయిన్ శ్రీ లీల తాజాగా విశాఖలో (Vizag) సందడి చేశారు. విశాఖ నగరంలోని జగదాంబ కూడలిలో… ఇవాళ ఓ షాపింగ్ మాల్ ఓపెన్ అయింది. హీరోయిన్ శ్రీ లీల చేతుల మీదుగా… ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేయించారు.
అభిమానులకు ఫ్లయింగ్ కిస్సులు
ఈ సందర్భంగా పట్టుచీరలో… హీరోయిన్ శ్రీ లీల మెరిశారు. అంతేకాదు ఈ సందర్భంగా పలు డిజైనర్ వస్త్రాలతో పాటు అగ్గిపెట్ట పట్టుచీరను కూడా… హీరోయిన్ శ్రీ లీల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన అభిమానులకు… ఫ్లయింగ్ కిస్సులు కూడా ఇచ్చారు. విశాఖ నగరానికి రావడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తన జీవితంలో అగ్గిపెట్ట పట్టుచీరను ఎప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు. మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తానని.. పేర్కొన్నారు.
శ్రీ లీల తన అభిమానులతో సంతోషాన్ని పంచుకుంటూ, మంచి సినిమాలతో ముందుకు సాగుతానని తెలిపారు. విశాఖ పర్యటన ఆమెకు మరపురాని అనుభవంగా మిగిలింది.


