|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏకంగా 29 ఆపరేషన్లు చేయించుకున్న టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి?

Published: 12-06-2025, 12:06 AM
ఏకంగా 29 ఆపరేషన్లు చేయించుకున్న టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి?

టాలీవుడ్‌లో అందాల తారగా పేరుగాంచిన శ్రీదేవి గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె 29 శస్త్రచికిత్సలు చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నిజానిజాల గురించి తెలుసుకుందాం.

Key Points

1

టాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి 29 ఆపరేషన్లు చేయించుకున్నారని వార్తలు

2

అందాన్ని కాపాడుకోవడానికి లేజర్ స్కిన్ సర్జరీ, బ్రెస్ట్ ట్రీట్మెంట్ వంటివి చేయించుకున్నట్లు

4

నిజానిజాలు తెలియకపోవడం వల్ల ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది

శ్రీదేవి అందం, ఆమె సినిమా ప్రస్థానం

సినిమా స్టార్స్ అంటే అందంగా కనిపించాలి, హీరోలు సిక్స్ ప్యాక్ తో, హీరోయిన్లు జీరో ప్యాక్ తో కనిపించాలని వారి ఫ్యాన్స్ కోరకుంటుంటారు. అయితే స్టార్స్ తమ గ్లామర్ ను కాపాడుకోవడం కోసం ఏదో ఒక సర్జరీ చేయించుకోవడం కామన్ గా మారింది ఈరోజుల్లో. ముక్కు,ముఖం, లిప్స్ ఇలా ఒకటేంటి అందంకోసం చాలా సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. ఈక్రమంలో ఓ హీరోయిన్ ఇలా అందం కోసం ఏకంగా 29 సర్జరీలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆహీరోయిన్ ఎవరో కాదు దివంగత తార శ్రీదేవి.

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అతిలోక సుందరి బిరుదు సాధించి, అందం, అభినయంతో అత్యద్భుతం చేసిన నటి శ్రీదేవి. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కోట్లాది మందిని ఆకట్టుకున్నారు. నటిగా ఎదగడానికి శ్రీదేవి చాలా కష్టపడ్డారు. శ్రీదేవి జీవితంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. తాజాగా ఆమె జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

29 సర్జరీల వార్తల వెనుక నిజం ఏమిటి?

శ్రీదేవి తన అందాన్ని కాపాడుకోవడం కోసం జీవితం మొత్తం లో 29 శస్త్రచికిత్సలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అందాన్ని మెరుగుపరిచే చికిత్సల్లో లేజర్ స్కిన్ సర్జరీ, సిలికాన్ బ్రెస్ట్ ట్రీట్మెంట్, ఫేస్ లిఫ్ట్ వంటి పద్ధతులు ఉన్నట్లు సమాచారం. ఆమె మరణానికి కొద్ది రోజుల ముందు లిప్ సర్జరీ కూడా చేయించుకున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

1950లో శివకాశి సమీప గ్రామంలో జన్మించిన శ్రీదేవి, బాలనటిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ప్రధాన ఇండస్ట్రీలలో అద్భుతం చేశారు. అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు శ్రీదేవి. 1980లలో ఆమె క్రేజ్ ఎంతలా ఉండేదంటే స్టార్ హీరోలకు సమానంగా శ్రీదేవిని ట్రీట్ చేసేవారు. హీరో అయిన , దర్శకుడైనా, నిర్మాత అయినా ఎవరైనా శ్రీదేవి డేట్స్ కోసం ఎదురు చూస్తేవారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు

శ్రీదేవి నటించిన సినిమాలకు దేశవ్యాప్తంగా ఆదరణ లభించేది. శ్రీదేవి సినిమా అనౌన్స్ అయిన దగ్గరి నుంచి భారీ బిజినెస్ జరగేది. స్టార్ హీరోలకు మాత్రమే లభించే హడావుడిని, ఫాలోయింగ్‌ను శ్రీదేవి హీరోయిన్ గా అందుకున్నారు. శ్రీదేవి నటన ఎంత అద్భుతం అంటే… ఆమె తెరపై కనిపించే ప్రతి సన్నివేశాన్ని ఓ విజువల్ వండర్ గా మలిచేది.

ఇక తన పెద్ద కూతురు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా పరిచయం చేయాలి అనుకున్నారు శ్రీదేవి. కాని జాన్వీని హీరోయిన్ గా చూడకుండానే కన్ను మూశారు. శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. ఆమె మరణం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కానీ ఆమె సినీ ప్రస్థానం, త్యాగాలు అభిమానుల గుండెల్లో శ్రీదేవికి చెరగని స్థానం కలిపించాయి.

శ్రీదేవి జీవితం గురించి ఈ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. అయితే, ఈ వార్తల నిజానిజాలను ధృవీకరించడం ముఖ్యం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.