|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్ హీరోయిన్స్ కొత్త మూవీస్.. ఈ నెలలోనే రిలీజ్

Published: 09-11-2025, 12:51 PM
టాలీవుడ్ హీరోయిన్స్ కొత్త మూవీస్.. ఈ నెలలోనే రిలీజ్

టాలీవుడ్ ప్రేక్షకుల ఎదురుచూపులకు తెరదించుతూ, ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కొత్త సినిమాలతో ఈ నెలలోనే రాబోతున్నారు. కీర్తి సురేశ్, ఆషికా రంగనాథ్ తమ తాజా చిత్రాలైన ‘రివాల్వర్ రీటా’, ‘గత వైభవం’ ద్వారా మళ్లీ తెలుగు తెరపై సందడి చేయనున్నారు. ఈ చిత్రాల విడుదల తేదీలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.

Key Points

1

కీర్తి సురేశ్ నటించిన 'రివాల్వర్ రీటా' నవంబరు 28న తెలుగు, తమిళ భాషల్లో విడుదల.

2

2023లో 'భోళా శంకర్' తర్వాత కీర్తి సురేశ్ నటిస్తున్న మొదటి చిత్రం ఇది.

4

'నా సామి రంగ' తర్వాత ఆషికా తెలుగులో ఈ నెలలోనే మరో చిత్రంతో పలకరించనుంది.

కీర్తి సురేశ్ రీ-ఎంట్రీ: ‘రివాల్వర్ రీటా’ విడుదల ఎప్పుడు?

ఎప్పటిక్పపుడు సినిమాలు చేస్తూ ఉంటేనే హీరోలకైనా హీరోయిన్లకైనా ఫేమ్ ఉంటుంది. అలానే హిట్‌ కూడా కొడుతూ ఉండాలి. లేదంటే ప్రేక్షకులు మర్చిపోయే అవకాశముంది. సరే ఇదంతా పక్కనబెడితే తెలుగులో హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఓ ఇద్దరు.. చాలా గ్యాప్ తర్వాత తమ కొత్త చిత్రాల్ని మన దగ్గర రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు రిలీజ్ డేట్స్ అధికారికంగా ప్రకటించారు.

స్వతహాగా మలయాళీ అయినప్పటికీ ‘నేను శైలజ’ అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేశ్.. తర్వాత టాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసింది. హిట్స్, ఫ్లాప్స్ అందుకుంది. అయితే 2023లో వచ్చిన ‘భోళా శంకర్’ తర్వాత మరో మూవీలో కనిపించలేదు. గతేడాది ‘కల్కి’లో ఈమె ఉంది కానీ కారు పాత్రకు డబ్బింగ్ చెప్పిందంతే. ఎన్నాళ్లగానో సెట్స్‌పై ఉండిపోయిన ‘రివాల్వర్ రీటా’ మూవీ.. ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నవంబరు 28న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుందని పోస్టర్ అయితే వదిలారు. గతంలో పలుమార్లు ఇలానే చెప్పారు గానీ వాయిదాపడింది. ఈసారైనా చెప్పిన టైంకి వస్తుందా లేదంటే మళ్లీ వాయిదా అనేది చూడాలి?

ఆషికా రంగనాథ్ కొత్త చిత్రం: ‘గత వైభవం’ విశేషాలు

గతేడాది సంక్రాంతికి రిలీజైన ‘నా సామి రంగ’ చిత్రంతో ఆకట్టుకున్న ఆషికా రంగనాథ్.. తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’లోనూ నటించింది. కానీ ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇంతలోనే ‘గత వైభవం’ అనే కన్నడ డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయిపోయింది. నవంబరు 14న ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడలోనూ రిలీజ్ కానుంది. దుశ్యంత్, ఆషిక హీరోహీరోయిన్లు కాగా సునీ దర్శకుడు. ఫాంటసీ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించబోతున్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి?

చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై ముద్దుగుమ్మలు

చాన్నాళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న కీర్తి సురేశ్, ఆషికా రంగనాథ్ తమ సినిమాలతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఈ ఇద్దరు హీరోయిన్స్ కొత్త చిత్రాలపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మంచి ఫలితాన్ని అందుకోవాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.