|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

2026లో టాలీవుడ్ సునామీ! ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో భారీ పాన్ ఇండియా యుద్ధం! రికార్డులు బద్దలే!

Published: 23-01-2026, 4:35 AM
2026లో టాలీవుడ్ సునామీ! ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో భారీ పాన్ ఇండియా యుద్ధం! రికార్డులు బద్దలే!
  • ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీతో సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం, 2026 రిలీజ్ టార్గెట్!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో 1980ల ఆంధ్రప్రదేశ్ బ్యాక్ డ్రాప్ తో మార్చి 27, 2026 రిలీజ్!
  • ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 1969 బ్యాక్ డ్రాప్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్!
  • నాని ‘ది ప్యారడైజ్’ మూవీ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సికింద్రాబాద్ నేపథ్యంలో మార్చి 26, 2026 రిలీజ్!

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవ్వడానికి రెడీగా ఉంది! ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలతో సందడి చేయడానికి వస్తున్నారు. అభిమానులకు పండగే!

ప్రభాస్ ‘ఫౌజీ’: వార్ డ్రామాతో హిట్ కొట్టేనా?

విభిన్న భాషలు, సంస్కృతులను కలిపి పాన్-ఇండియా సినిమాలు భారతీయ సినిమాను ఏకీకృతం చేస్తున్నాయి. 2026లో భారీ బడ్జెట్ చిత్రాలు రానున్నాయి. ఇవి అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకుంటాయి. బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది భారీగా సందడి నెలకొనబోతోంది.

1940ల కాలం నాటి యుద్ధ డ్రామా కథతో తెరెక్కుతోన్న సినిమా ఫౌజీ.  ఈసినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. రాజా సాబ్ తో ఫెయిల్యూర్ ను ఫేస్ చేసిన ప్రభాస్.. ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

1980ల గోవా నేపథ్యంలో ‘టాక్సిక్’ సినిమా తెరకెక్కుతోంది. గ్యాంగ్‌స్టర్ల మధ్య జరిగే హింసాత్మక పోరాటమే ఈ కథ. యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మార్చి 19, 2026న విడుదల కానుంది.రీసెంట్ గా రిలీజ్ అయిన టాక్సిక్ మూవీ టీజర పెద్ద వివాదానికి దారితీసింది. గీతూ మోహన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుంది.

కెేజీయఫ్, సలార్ సినిమాల దర్శకుడు  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’. 1969లో భారత్, చైనా, భూటాన్ సరిహద్దు ప్రాంతంలో ఈ కథ జరుగుతుంది. అనిల్ కపూర్ విలన్‌గా నటిస్తున్నారు. ఈసినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ను కంప్లీట్ గా మార్చేసుకున్నారు. ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈ ఏడాది రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.

రామ్ చరణ్ ‘పెద్ది’: పవర్ స్టార్ మాస్ ట్రీట్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న మరో పాన్ ఇండియా సినిమా పెద్ది. ఈమూవీకి బుచ్చిబాబు డైరెక్టర్.  1980ల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ ఈ పెద్ది సినిమా.  రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న  పెద్ది.. క్రీడల ద్వారా తన గ్రామాన్ని ఏకం చేసే యువకుడి కథ ఇది. ఈ సినిమా మార్చి 27, 2026న విడుదల కానుంది.

1980 ల కథతో,  సికింద్రాబాద్ నేపథ్యంలో నాని హీరోగా వస్తున్న యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. తమ గౌరవం, గుర్తింపు కోసం పోరాడే గిరిజన తెగ కథ ఇది. నానీ లుక్స్ అయితే అదిరిపోయాయి. నేచురల్ స్టార్ ను ఈ రేంజ్ లో ఎప్పుడుూ చూసి ఉండరు.  మార్చి 26, 2026న ఈ సినిమా విడుదల కాబోతోంది.

‘జైలర్’ భారీ విజయం సాధించడంతో, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ సీక్వెల్‌లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

ఎన్టీఆర్ ‘డ్రాగన్’: ప్రశాంత్ నీల్ మ్యాజిక్ రిపీట్!

ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే రొమాంటిక్ ఫాంటసీ కామెడీ వస్తోంది. నిజమైన ప్రేమ కోసం 2035కి టైమ్ ట్రావెల్ చేసే యువకుడి కథ ఇది. విఘ్నేష్ శివన్ దర్శకుడు.

రష్మిక మందన్న శక్తివంతమైన గిరిజన మహిళ  పాత్రలో నటిస్తోన్న సినిమా ‘మైసా’. చాలాపవన్ ఫుల్ లేడీగా రష్మిక నటిస్తోంది. తన జీవిత రహస్యాన్ని ఛేదించే ధైర్యవంతురాలైన మహిళ కథ ఇది. రవీంద్ర పుల్లే దర్శకుడు. ఈ సినిమా అద్భుతమైన విజువల్స్‌తో వస్తోంది.

నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’ ఒక స్వర్ణయుగాన్ని సృష్టించిన చక్రవర్తి కథ. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 13, 2026న విడుదల కానుంది.

2026లో భారీ సినిమాలు విడుదల కానున్నాయి. ఏ సినిమా ఏ రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.