
టాలీవుడ్ నిర్మాత ఎస్ కె ఎన్ తాజాగా ఒక షాకింగ్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న బైక్, కార్ రేసుల వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Key Points
టాలీవుడ్ నిర్మాత ఎస్ కె ఎన్ షాకింగ్ వీడియో షేర్ చేశారు.
రోడ్డుపై బైక్, కార్ రేసింగ్స్ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన.
మై హోం భుజా పక్క రోడ్డు, నీలోఫర్ కేఫ్ రోడ్డు ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి.
పోలీసులను ఆయన ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎస్ కె ఎన్ షాకింగ్ వీడియోను షేర్ చేశారు
టాలీవుడ్ నిర్మాత ఎస్ కె ఎన్(SKN) ‘బేబీ’(baby) సినిమా ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఆయన నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫుల్ ఫేమ్ దక్కించుకున్నారు. తాజాగా, ఎప్ కెఎన్ ట్విట్టర్ ద్వారా షాకింగ్ వీడియోను షేర్ చేశారు. ‘‘మై హోం భుజా పక్క రోడ్డులో, నీలోఫర్ కేఫ్ రోడ్డులో, సత్వ బిల్డింగ్, ఇనార్బిట్ మాల్, హైటెక్ సిటీ ఏరియాల్లో ఎక్కువగా బైక్ రేసింగ్స్ అప్పుడప్పుడు కార్ రేసింగ్స్ జరుగుతున్నాయి.
వాళ్లు ఇలానే కంటిన్యూ చేస్తే అక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. అక్కడే రెండు పోలీస్ స్టేషన్లున్నాయి.. మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ల పరిధిలోనే ఇదంతా ఉంటుంది.. ఇలాంటి వాటిని వెంటనే కట్టడి చేసి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కాకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.. వాటి వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం కూడా ఏర్పడుతూ ఉంటుంది’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా యాక్సిడెంట్ వీడియోను కూడా షేర్ చేశారు. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
రోడ్డు రేసుల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి
పోలీసుల చర్యలు అవసరమని ఎస్ కె ఎన్ కోరిక
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్ కె ఎన్ పోలీసులను కోరారు. పబ్లిక్ ప్రాపర్టీని కాపాడటానికి మరియు ప్రజల భద్రతను నిర్ధారించడానికి ఇది చాలా అవసరం.


