|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కొందరు హీరోలు పీడించుకు తింటున్నారు..ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు

Published: 01-07-2025, 12:25 AM
కొందరు హీరోలు పీడించుకు తింటున్నారు..ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ ప్రొడ్యూసర్ శిరీష్ రెడ్డి, ఆర్య సినిమా విడుదల తర్వాత హీరో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ గురించి సంచలన విషయాలను వెల్లడించారు. ఆయన కొంతమంది హీరోలపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Key Points

1

టాలీవుడ్ ప్రొడ్యూసర్ శిరీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2

ఆర్య సినిమా రెమ్యునరేషన్ విషయంలో అల్లు అర్జున్ వైఖరి

4

ప్రొడ్యూసర్ల కొడుకులు హీరోలుగా వచ్చి రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బందులు కలిగిస్తున్నారని వ్యాఖ్య

శిరీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ప్రొడ్యూసర్ శిరీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్య సినిమాను ఆరు కోట్ల బడ్జెట్ తో నిర్మించామని అన్నారు. సినిమా విడుదలకు ముందు హీరో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ గురించి అల్లు అరవింద్ తో మాట్లాడామని అన్నారు. కానీ ఆయన ముందు సినిమా తీయాలని, తరవాత మాట్లాడుకుందామని చెప్పారన్నారు. సినిమా విడుదల వరకు రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో అని ఖంగారు పడ్డామని చెప్పారు. సినిమా విడుదలయ్యే వరకు టెన్షన్ తో రెమ్యునరేషన్ గురించి అడిగామని కానీ ఆయన ఖండారు పడకండి అని చెప్పారన్నారు.

సినిమా విజయం సాధించిన తరవాత వెళ్లి అడిగితే నైజాం కలెక్షన్లలో కోటి వసూలు చేస్తే పదిలక్షలు, రెండు కోట్లు వసూలు చేస్తే ఇరవై లక్షలు ఇవ్వమని అడిగారన్నారు. నాలుగు కోట్లు చేస్తే 40 లక్షలు ఇవ్వండి కానీ 5 కోట్లు చేస్తే రూ.50 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారన్నారు. అంటే బన్నీ రెమ్యునరేషన్ రూ.40 లక్షలు అని చెప్పారు. ఆ డబ్బులు కూడా తరవాత ఇవ్వమన్నారన్నారు. కానీ కొంతమంది ప్రొడ్యూసర్ల కొడుకులు హీరోలుగా వచ్చి రెమ్యునరేషన్ కోసం పీడిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఆర్య సినిమా రెమ్యునరేషన్ వివరాలు

హీరోల రెమ్యునరేషన్ వివాదం

శిరీష్ రెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. హీరోల రెమ్యునరేషన్ విధానంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.