|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Tollywood: ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా మారదాం: రామ్ చరణ్

Published: 26-06-2025, 10:43 AM
Tollywood: ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా మారదాం: రామ్ చరణ్

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, టాలీవుడ్ నటులు రామ్ చరణ్ మరియు విజయ్ దేవరకొండ డ్రగ్స్ దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించారు. డ్రగ్స్ నిర్మూలనకు టాలీవుడ్ పూర్తి సహకారం అందిస్తుందని దిల్ రాజు తెలిపారు.

Key Points

1

రామ్ చరణ్, విజయ్ దేవరకొండ డ్రగ్స్‌ ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు.

2

డ్రగ్స్‌ నిర్మూలనకు టాలీవుడ్ పూర్తి సహకారం అందిస్తుందని దిల్ రాజు తెలిపారు.

4

ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం కోసం డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని విజయ్ దేవరకొండ సూచన.

డ్రగ్స్‌ నిర్మూలనకు టాలీవుడ్‌ సహకారం

తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న కృషికి టాలీవుడ్ నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, సినీ నిర్మాత దిల్‌రాజు అన్నారు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మలయాళ చిత్ర పరిశ్రమలాగే మనం కూడా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడేవారిపై నిషేధం విధించేలా సినీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.

రామ్ చరణ్, విజయ్ దేవరకొండల అభిప్రాయాలు

రామ్ చరణ్ మాట్లాడుతూ..’ మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక మంచి హై..  ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడిపితే అది మంచి హై.. ఈవెనింగ్ స్పోర్ట్స్ ఆడి ఫ్రెష్ అయితే అది ఒక మంచి హై.. గోపిచంద్ చెప్పినట్లు ఆ హై వేరు.. మనల్ని మనమే రక్షించుకుందాం.. డ్రగ్స్‌కి యువత దూరంగా ఉండాలి.. జీవితాలని పాడుచేసుకోకూడదు.. మన సోసైటీ మనమే క్లీన్ చేసుకుందాం. గతంలో కొన్ని స్కూల్స్‌ బయట డ్రగ్స్‌ అమ్ముతున్నారని తెలిసి బాధేసింది. అప్పుడు నేను తండ్రిని కాదు. ఇప్పుడు నేను కూడా ఒక తండ్రిని. ఒక విజయవంతమైన సినిమా చేసినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. మన కుటుంబంతో మొదలు పెట్టి స్కూల్‌, సమాజం బాగుచేసుకుందాం. ఈ విషయంలో పోలీస్‌శాఖ కృషిని ప్రశంసిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడిలా మారదాం.. డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం’ అని పిలుపునిచ్చారు.

ఆరోగ్యకరమైన సమాజం కోసం పిలుపు

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఒక్కసారి ట్రై చేయిరా అనే వాళ్లు ఉంటారు. కానీ ఒక్కసారి అటువైపు వెళ్తే ఇక బయటపడటం కష్టం. ఎవరైనా మనకు అలాంటి వాళ్లు కనపడితే వారికి దూరగా ఉందాం. జిమ్‌లో మంచి వర్కవుట్ చేస్తే మంచిగా అనిపిస్తది. నాకు డబ్బులు సంపాదించినప్పుడు ఒక హై వస్తది. డబ్బులు ఇంకొకరికి ఇచ్చి హెల్ప్ చేస్తున్నప్పుడు ఒక హై వస్తది.  నచ్చిన పని చేస్తున్నప్పుడు ఒక హై వస్తది. నచ్చిన పని చేసి సక్సెస్ అందుకున్నప్పుడు ఒక హై వస్తది. ఛేజ్ ది సక్సెస్ … డ్రగ్స్ వంటి నెగిటివిటీకి దూరంగా ఉండండి. మిమ్మల్ని చూసి మీ పేరేంట్స్ గర్వపడతారు. సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తది. అందుకే మన డ్రగ్స్‌కి దూరంగా ఉందాం. ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని అన్నారు.

డ్రగ్స్‌ వల్ల కలిగే నష్టాలను గుర్తించి, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడం చాలా ముఖ్యం. సమాజాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.