|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమాల విడుదల తేదీల గందరగోళం! మేకర్స్ ప్లానింగ్‌లో తప్పటడుగులా?

Published: 30-03-2026, 7:45 AM
  • ‘పెద్ది’ సినిమా గ్లింప్స్‌లో ఏప్రిల్ 30న విడుదల అని ప్రకటించిన మేకర్స్.
  • షూటింగ్ పూర్తి కాకుండానే రిలీజ్ డేట్ ఎలా వేశారని ప్రశ్నలు.
  • నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభూ’ పరిస్థితి కూడా గొప్పగా ఏమీ లేదు.
  • సమ్మర్ రిలీజ్ అని మాత్రమే ప్రకటించిన మేకర్స్.

టాలీవుడ్‌లో విడుదల తేదీల విషయంలో గందరగోళం నెలకొంది. ‘పెద్ది’, ‘స్వయంభూ’ సినిమాలు అనుకున్న సమయానికి వస్తాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మేకర్స్ విడుదల తేదీలను ప్రకటించి వెనక్కి తగ్గడంపై విమర్శలు వస్తున్నాయి.

రిలీజ్ డేట్స్ విషయంలో మేకర్స్ ఆడుతున్న ఆట

Tollywood release delays: అప్పడే వస్తున్నామంటారు ..అబ్బే అప్పుడే రావట్లేదంటారు…ఇదీ గత కొంతకాలంగా మేకర్స్ రిలీజ్ ల విషయంలో ఆడుతున్న ఆట. ఇక ఆటలో ది బెస్ట్ గా నిలిచేందుకు తెగ పోటీ పడుతున్నారు చరణ్, నికిల్ లు.ఇది వరకే ఎన్నో సార్లు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి తీరా వెనక్కి వెళ్ళిన వీరి సినిమాల చుట్టూ నడుస్తున్న హై-డ్రామా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపొయింది.మొత్తానికి క్లారిటీ లేని రిలీజ్ డేట్లు, కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్.. అసలు ఏప్రిల్ బాక్సాఫీస్ దగ్గర ఏం జరుగుతోంది?

రెండు సినిమాల చుట్టూ నడుస్తున్న హై-డ్రామా

సమ్మర్ సీజన్ వస్తుందంటే చాలు ..సెలవుల్ని ఎంచక్కా చల్లని ఏసీ థియేటర్లలో సినిమాలు చూస్తూ లాగించేయాలని చాలా మంది ఆశ పడతారు. ముఖ్యంగా పిల్లల కోసమైనా పేరెంట్స్ సినిమా హళ్ళ వైపు నడవాల్సిన పరిస్థితి. ఇక ఎలాగూ ఈ సమ్మర్లో వస్తామంటూ ఇప్పటికే డేట్స్ అనౌన్స్ చేయడంతో ‘పెద్ది’,’స్వయంభూ’ లాంటి విజువల్ ఐ ఫీస్ట్ మూవీస్ చూసి ఎంటర్ టైన్ కావొచ్చు అనుకున్నారంతా.కానీ చూడాలని మీకుంటే మాత్రం మేం రావాలిగా అన్నట్టుగా ఈ రెండు సినిమాల చుట్టూ నడుస్తున్న హై-డ్రామా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇదంతా ఆడియన్స్‌ని ‘ఏప్రిల్ ఫూల్’ చేయడానికేనా

‘పెద్ది’, ‘స్వయంభూ’ సినిమాల చుట్టూ హై-డ్రామా

నిజానికి 2 రోజుల క్రితం ‘పెద్ది’ సినిమా గ్లింప్స్ చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కారణం అందులో రిలీజ్ డేట్ ఏప్రిల్ 30 అని ఉండటమే. సినిమా రిలీజ్ కి మరో నెల రోజులే ఉన్న మేకర్స్ ఇంత కాన్ఫిడెంట్ గా డేట్ వేశారంటే పక్కా అనుకున్నారంతా. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది.అవును ఇంకా రెండు పాటల షూటింగ్ తో పాటు ప్యాచ్ వర్క్ కూడా పెండింగ్ ఉందన్న టాక్ వినిపిస్తుంది. దీంతో అసలు షూటింగ్ పూర్తి కాకుండానే గ్లింప్స్‌లో రిలీజ్ డేట్ ఎలా వేస్తారన్న క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయ్. ఇప్పుడు ‘క్వాలిటీ’ పేరుతో సినిమాను వాయిదా వేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి క్లారిటీ లేనప్పుడు అసలు ఆ డేట్ అనౌన్స్‌మెంట్ ఎందుకు చేసినట్టు? ఇదంతా ఆడియన్స్‌ని ‘ఏప్రిల్ ఫూల్’ చేయడానికేనా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయ్.

ఇక పెద్ది పరిస్థితి ఇలా ఉంటె నిఖిల్ సిద్ధార్థ్ ‘స్వయంభూ’ పరిస్థితి కూడా ఇంతకన్నా గొప్పగా ఏమీ లేదు. ఉగాది పోస్టర్ వదిలారు కానీ అందులో డేట్ లేదు. కేవలం ‘సమ్మర్ రిలీజ్’ అని చేతులు దులిపేకున్నారు. లెక్కప్రకారం ఏప్రిల్ 10న రావాలి ,కానీ ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్ లేదు.ఒక వేళ ఓటీటీ డీల్ సెట్ అవ్వలేదా లేక VFX కంప్లీట్ అవ్వలేదా ..అనుకున్నట్టుగా ఏప్రిల్ 10న సినిమా రావట్లేదా సరే.మరి కొత్త డేట్ ఏది? ఇలా వస్తామని ఊరించిన ఈ రెండు సినిమాలకి ఇపుడు క్లారిటీ లేకపోవడం ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తోంది.

చిన్న సినిమాల ప్లాన్ గట్టిదే

క్వాలిటీ పేరుతో వాయిదాల డ్రామా?

అయితే పెద్ద సినిమాలు వాయిదాల పాట పాడితే చిన్న మరియు మీడియం రేంజ్ సినిమాలు మాత్రం గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నాయండోయ్.అవును.. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ‘బైకర్’, ‘రాకాస’ సినిమాలు బరిలో దిగడానికి సిద్దమవుతుంటే సెకండ్ వీక్ లో అడివి శేష్ తన మార్క్ సస్పెన్స్ చూపిస్తానంటూ ‘డెకాయిట్’ తో దూసుకొస్తున్నాడు.ఇక మూడో వారంలో ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’, ‘తిమ్మరాజుపల్లి టీవీ’ వంటి సినిమాలు ఉండనే ఉన్నాయ్.

ఏదేమైనా వాయిదాల పాట పాడటం టాలీవుడ్ కి కొత్తేమీ కాదు . కానీ, అనౌన్స్ చేసిన డేట్లను నిలబెట్టుకోలేకపోవడమె పెద్ద మైనస్. క్వాలిటీ కోసం వాయిదా వేయడం మంచిదే, కానీ ముందే పక్కా ప్లానింగ్ లేకపోవడం వల్ల బయ్యర్లు, ప్రేక్షకులు ఇబ్బంది పడతారన్న విషయం మేకర్స్ గ్రహిస్తే మంచిది. చూడాలి ..ఏప్రిల్ బాక్సాఫీస్ దగ్గర ఈ ‘డేట్ల గోల’ ఎప్పటికి సర్దుకుంటుందో !

మొత్తానికి విడుదల తేదీలపై స్పష్టత లేకపోవడంతో అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. నిర్మాతలు త్వరగా స్పందించి ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.