|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Maruthi : ప్రగతి గారు మిమ్మల్ని బూతులు తిడుతున్నారు కానీ మీరు పట్టించుకోకండి

Published: 10-12-2025, 1:08 PM
Maruthi : ప్రగతి గారు మిమ్మల్ని బూతులు తిడుతున్నారు కానీ మీరు పట్టించుకోకండి
  • నటి ప్రగతి తన నటనతో పాటు వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు.
  • సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివ్ కామెంట్స్‌ను ప్రగతి పెద్దగా పట్టించుకోకుండా తన లక్ష్యాలను సాధించారు.
  • మారుతి త్రీ రోజెస్ ఈవెంట్‌లో ప్రగతి సాధించిన గోల్డ్ మెడల్స్‌ను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
  • నెగిటివ్ కామెంట్స్‌ను తిట్లుగా కాకుండా విజయానికి శక్తిగా మార్చుకోవాలని మారుతి సలహా ఇచ్చారు.

నటి ప్రగతి తన వెయిట్ లిఫ్టింగ్ ప్రయాణం, సోషల్ మీడియాలో ఎదుర్కొన్న నెగిటివ్ కామెంట్స్‌పై దర్శకుడు మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రీ రోజెస్ ఈవెంట్‌లో మారుతి మాట్లాడుతూ, తిట్లను విజయానికి సోపానంగా మార్చుకోవాలని ప్రగతిని ప్రశంసించారు.

ప్రగతి: నటన నుండి వెయిట్ లిఫ్టింగ్‌కు

Maruthi : నటి ప్రగతి గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు ఎన్నో పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. చిరుత సినిమాలో రామ్ చరణ్ తేజ్ కు అమ్మగా నటించి విపరీతమైన గుర్తింపు సాధించుకున్నారు. నటనలో ఆవిడతో ఒక ప్రత్యేకమైన శైలి.

కేవలం నటించడం మాత్రమే కాకుండా వెయిట్ లిఫ్టింగ్ కూడా ఆవిడ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా instagram లో ఆమె వీడియోలు చూసి చాలామంది విపరీతమైన కామెంట్స్ చేసేవాళ్ళు. కానీ పెద్దగా అవేవీ పట్టించుకోకుండా ఆవిడ అనుకున్నది సాధించాలి అనుకొని అచీవ్ చేశారు. దానిపై మారుతి ఇప్పుడు త్రీ రోజెస్ ఈవెంట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

నెగిటివ్ కామెంట్స్‌పై మారుతి వ్యాఖ్యలు

ప్రగతి గారికి అది ఎమోషనల్ డే అవ్వచ్చు అది మా అందరికీ కూడా కన్వే అయింది. మేడం మిమ్మల్ని అందరూ తిడుతున్నారు అని ఏమీ అనుకోకండి. ఎందుకంటే అలా తిట్టకపోయి ఉంటే మీరు ఈరోజు ఈ గోల్డ్ మెడల్స్ సాధించి ఉండేవాళ్ళు కాదు. నేను రాజా సాబ్ సినిమా తీసేవాడిని కాదు. ఎందుకంటే వాళ్లు నిజంగా వాళ్ళ పనులన్నీ మానుకొని, వాళ్ల కాన్సన్ట్రేషన్ మొత్తం మన మీద పెట్టి, వాళ్ల పాజిటివిటీ మొత్తం చంపుకొని ఒక నెగిటివ్ ఆలోచనలు తెచ్చుకొని, ఒక నాలుగు తిట్లు తిడుతున్నారు. అంటే అంత ఈజీ కాదు మేడం అది.

పాపం వాళ్ళ దగ్గర ఉన్నదే పంచుతున్నారు. అంతకుమించి ఇంకేం ఇవ్వగలరు చెప్పండి. వాళ్ళ దగ్గరికి కేవలం ఉన్నది నాలుగు బూతు మాటలు మాత్రమే. నేను కామెంట్స్ చూసిన ప్రతిసారి అనుకుంటా ఒరేయ్ నీ దగ్గర ఉన్నది ఇదేనా ఇంకేం లేదా అని. మా నాన్న ఇప్పుడు ఒక మాట చెబుతూ ఉండేవాడు నాన్న వాళ్ళ తిడుతున్నారు నువ్వేమీ అనవా అంటే ఒరేయ్ వాళ్ళ దగ్గర ఉన్నది అదే రా మన దగ్గర అలాంటి గుణం లేదు కదా అనేవాడు.

తిట్లను విజయానికి సోపానంగా మలుచుకోండి

అందుకే చెబుతున్నా ఎవరైనా తిడితే దానిని ఎనర్జీగా మార్చుకోండి. అలా మార్చుకుంటేనే ప్రగతి గారి లాగా ఒక గోల్డ్ మెడల్ వస్తుంది. అలా మీరు కూడా తిట్టే వాళ్ళని వెతుక్కోండి. లేకపోతే మీరేమీ సాధించలేరు. నెగిటివ్ కామెంట్స్ ఇచ్చే వాళ్ళకి చాలా థాంక్యూ మీరు లేకపోతే నేను ఎన్ని సాధించలేము.

మారుతి వ్యాఖ్యలు నెగిటివిటీని ఎలా స్వీకరించి, దానిని విజయం వైపు నడిపించవచ్చో తెలియజేశాయి. ప్రగతి గారి విజయానికి తిట్లు కూడా ఒక కారణమని, వాటిని ఎనర్జీగా మార్చుకోవడమే సరైన మార్గమని ఆయన సందేశం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.