|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ హఠాన్మరణం

Published: 11-06-2025, 3:01 AM
టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ హఠాన్మరణం

తెలుగు సినిమా పరిశ్రమకు విషాదం. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ గుండెపోటుతో మృతి చెందారు. బాలకృష్ణ, గోపీచంద్ లాంటి హీరోలతో ఆయన తీసిన సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.

Key Points

1

ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ గుండెపోటుతో మృతి.

2

బాలకృష్ణ, గోపీచంద్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించారు.

4

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.

ఏఎస్ రవికుమార్ మృతి

తెలుగు సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ ద‌ర్శకుడు ఏఎస్ రవికుమార్ (Director A.S. Ravikumar) గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తుంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి అస్వస్థత (Illness)కు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటు (heart attack) కారణంగా చివరి శ్వాస విడిచినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా రవి కుమార్ దర్శకుడిగా బాలయ్య, గోపీచంద్ వంటి హీరోలతో మంచి సినిమాల తీసి పేరు తెచ్చుకున్నారు. రవికుమార్ మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త తెలుసుకున్న ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రవికుమార్ గోపిచంద్ హీరోగా ‘య‌జ్జం’ మూవీతో ద‌ర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌రువాత బాల‌కృష్ణతో ‘వీర‌భద్ర’, సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో ‘పిల్లా నువ్వులేని జీవితం’, గోపిచంద్‌తో ‘సౌఖ్యం’, నితిన్‌తో ‘ఆటాడిస్తా’ వంటి సినిమాలు తెర‌కెక్కించారు. చివ‌రిగా రాజ్‌త‌రుణ్‌తో ‘తిర‌గ‌బ‌డ‌రా సామి’ సినిమాని చిత్రికరించారు.

టాలీవుడ్ లో విషాదం

దర్శకుని సినీ జీవితం

ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ మృతితో తెలుగు సినీ పరిశ్రమ లో విషాదం నెలకొంది. ఆయన సినీ రంగం చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.