
📌 Key Points
- నాగార్జున 3 వేల కోట్ల ఆస్తులతో టాలీవుడ్ లోనే అత్యంత ధనవంతుడైన హీరోగా మొదటి స్థానంలో ఉన్నారు.
- వెంకటేష్ 2 వేల కోట్ల ఆస్తితో రెండవ స్థానంలో, చిరంజీవి 1650 కోట్ల ఆస్తితో మూడవ స్థానంలో నిలిచారు.
- రామ్ చరణ్ తన సొంత కష్టంతో 1370 కోట్ల ఆస్తిని సంపాదించారు.
- ప్రభాస్ కు 1200 కోట్ల రూపాయల ఆస్తి ఉంది.
టాలీవుడ్ లో హీరోలు తమ సినిమాల ద్వారా వచ్చే డబ్బును వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెడుతూ మరింత సంపాదిస్తున్నారు. టాలీవుడ్ లో అత్యంత ధనవంతులైన హీరోల జాబితా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ జాబితాలో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారో చూద్దాం.
టాలీవుడ్ లో అత్యధిక ఆస్తులు ఎవరికి?
Tollywood Richest Hero’s:సాధారణంగా ప్రతి ఏడాది హీరోలు తమ స్థాయిని పెంచుకుంటూనే.. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును వివిధ రంగాలలో పెట్టుబడులుగా పెడుతూ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. ఒక హీరోకి ఒక సినిమాతో హిట్టు పడిందంటే చాలు అమాంతం ఆయన రెమ్యూనరేషన్ పెంచేస్తారు. అలాగే తమ నటనకు అవార్డు లభించింది అంటే ఇక ఆ అమౌంట్ మరింత పెరిగిపోతుంది. ఇకపోతే సెలబ్రిటీలు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును తెలివిగా వివిధ రంగాలలో పెట్టుబడులు పెడుతున్నారు.. కొంతమంది మల్టీప్లెక్స్ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే.. మరి కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంపై ఆసక్తి కనబరుస్తున్నారు. మరి కొంతమంది ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు.. అలా ఈ క్రమంలోనే ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన హీరోల జాబితా వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆ టాలీవుడ్ హీరో మార్క్ ను ఇప్పటివరకు మరో టాలీవుడ్ హీరో చెరపకపోవడం ఆశ్చర్యకరం అనే చెప్పాలి.. మరి ఆయన ఎవరు? మిగతా హీరోలలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు అనగానే టక్కున గుర్తొచ్చేవారు నాగార్జున (Nagarjuna), చిరంజీవి(Chiranjeevi ), వెంకటేష్(Venkatesh ), బాలకృష్ణ (Balakrishna)… అయితే ఈ నలుగురిలో ప్రథమంగా వినిపించే పేరు నాగార్జున. ఏకంగా 3వేల కోట్ల ఆస్తులు కలిగి ఉండి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులు ఉన్న హీరోగా మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. అటు ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో ఎప్పుడూ స్థానాన్ని దక్కించుకునే నాగార్జున.. ఇక్కడ టాలీవుడ్ లో మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఇకపోతే ఈ రేంజ్ లో ఆస్తులను కూడబెట్టి ఈయన రికార్డును మరో హీరో చెరపలేకపోతున్నారు. దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగార్జున.. తండ్రి ఆస్తులతో పాటు సొంత ఆస్తులతో రికార్డుల్లోకి ఎక్కారు.. ఆ తర్వాత 2000 కోట్ల ఆస్తితో విక్టరీ వెంకటేష్ రెండవ స్థానాన్ని దక్కించుకోగా.. 1650 కోట్ల ఆస్తితో చిరంజీవి మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు.
టాప్ హీరోల ఆస్తుల వివరాలు
ఇకపోతే టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్స్ గా చలామణి అవుతున్న మహేష్ బాబు , అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి తారలు అటు ఆస్తులలో కూడా సంచలనం సృష్టిస్తున్నారు. రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి ఆస్తులు కాకుండా కేవలం తన సొంత కష్టంతో 1370 కోట్ల ఆస్తిని సొంతం చేసుకున్నారు. ప్రభాస్ 1200 కోట్లు కలిగి ఉండగా.. మహేష్ బాబు సొంత కష్టార్జితం 400 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఇక అల్లు అర్జున్ 380 కోట్లు సంపాదించగా.. ఎన్టీఆర్ 270 కోట్లు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
యంగ్ హీరోల ఆస్తుల విలువ ఎంత?
ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 200 కోట్ల ఆస్తితో అందరినీ ఆశ్చర్యపరచగా.. రవితేజ 150 కోట్ల ఆస్తిని దక్కించుకున్నారు. ఇక విజయ్ వంద కోట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఏది ఏమైనా మన టాలీవుడ్ హీరోలు తెలివిగా పెట్టుబడులు పెడుతూ తమ ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు అని చెప్పవచ్చు.
టాలీవుడ్ లో అగ్ర హీరోలు తమ నటనతోనే కాకుండా ఆస్తుల పరంగా కూడా దూసుకుపోతున్నారు. భవిష్యత్తులో ఈ జాబితాలో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.


