
ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. తాజాగా, ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Key Points
ప్రభాస్ 'ది రాజాసాబ్' డిసెంబర్ 5న విడుదల
తమన్నా ఐటెం సాంగ్‌లో నటించే అవకాశం
ప్రభాస్, తమన్నా మళ్ళీ కలిసి నటించడం అభిమానులకు ఆనందం
ది రాజాసాబ్ విడుదల తేదీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టి ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. త్వరలో డార్లింగ్ ‘ది రాజాసాబ్’(The Rajasaab) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర కామెడీ జానర్‌లో రాబోతుంది. మొదటిసారి ప్రభాస్ హారర్ మూవీలో నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రింద టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తమన్నా స్పెషల్ అప్పీయరెన్స్
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్, విడుదలై భారీ హైప్ పెంచాయి. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ది రాజాసాబ్’ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను కన్ఫర్మ్ చేసినట్లు టాక్. మిల్కీబ్యూటీ తమన్నాను మూవీ టీమ్ సంప్రదించగా.. అందుకు ఆమె గ్రీస్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
సినిమాపై అంచనాలు
అయితే తమన్నా డ్యాన్స్ స్టెప్పులతో ఈ పాటను హైలెట్‌గా చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు థియేటర్స్ మోత మోగిపోవాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇప్పటికే ప్రభాస్, తమన్నా రెబల్, బాహుబలి-1, బాహుబలి-2 వంటి చిత్రాల్లో రొమాన్స్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరు జత కట్టబోతుండటంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఎక్జైట్ అవుతున్నారు.
తమన్నా ఐటెం సాంగ్ తో ‘ది రాజాసాబ్’ సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్, తమన్నా జోడి మళ్ళీ తెరపై కనిపించడం అభిమానులకు పండగే.


