
📌 Key Points
- పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26న విడుదల! శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు.
- ఏప్రిల్ 3న శర్వానంద్ ‘బైకర్’ విడుదల! రాజశేఖర్ కీలక పాత్ర, మాళవికా నాయర్ హీరోయిన్.
- నిఖిల్ ‘స్వయంభు’ భారీ హిస్టారికల్ మూవీ! భారీ అంచనాలు, విడుదల తేదీ త్వరలో!
- ఏప్రిల్ 10న అడివి శేష్ ‘డెకాయిట్’ విడుదల! మృణాల్ ఠాకూర్ హీరోయిన్, అనురాగ్ కశ్యప్ విలన్.
టాలీవుడ్ లో సమ్మర్ సినిమాల సందడి మొదలైంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి ముగిసిన తర్వాత, సినీ ఇండస్ట్రీ దృష్టి ఇప్పుడు అత్యంత కీలకమైన సమ్మర్ 2026 సీజన్‌పై పడింది. సాధారణంగా ఏ సినిమాకైనా వేసవి సెలవులు ఒక గోల్డెన్ అవకాశం అని చెప్పవచ్చు. అందుకే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేందుకు అగ్ర హీరోల నుంచి యంగ్ స్టార్స్ వరకు అంతా ఈ సమ్మర్ బరిలో నిలిచేందుకు పోటీపడుతున్నారు.
వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్ చిత్రాల నుంచి విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాల వరకు ఒక రేంజ్ లో క్యూ కడుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈసారి వేసవి వేడికి మించి సినిమాల వేడి ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ ఏడాది సమ్మర్ ఎందుకు స్పెషల్ అంటే.. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాని వంటి స్టార్ హీరోలు తమ క్రేజీ ప్రాజెక్టులు పెద్ది, ది ప్యారడైజ్, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలతో పోటీకి సిద్ధమయ్యారు. దానికి తోడు కొన్ని భారీ సినిమాలు కూడా షూటింగ్ పూర్తి కానుందున.. సమ్మర్ రేసులోకి రావడం ఈ సీజన్‌ను మరింత రసవత్తరంగా మార్చనుంది.
మార్చి 26: ఉస్తాద్ భగత్ సింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నది. అయితే ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కానున్నది.
శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన తాజా చిత్రం ‘బైకర్’ (Biker). అభిలాష్ రెడ్డి కంకర (Abhilash Reddy Kankara) దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ (UV Creations) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. యాంగ్రీ యంగ్ మెన్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర చేస్తున్నాడు. మాళవికా నాయర్ (Malvika Nair) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది.
శర్వానంద్ ‘బైకర్’ తో వస్తున్నాడు! రాజశేఖర్ కూడా ఉన్నాడుగా!
సంగీత్ శోభన్ (Sangeeth Sobhan)మొదటి సారి సోలో హీరోగా తెరపైకి రాబోతున్న సినిమా రాకాస. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 3న విడుదల చేయబోతున్నారు.
హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘ డెకాయిట్ ’అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని షానీల్ డియో డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానున్నట్లు సమాచారం.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ లేటెస్ట్ హిస్టారికల్ ఎపిక్ ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ మూవీని నిర్మిస్తున్నారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తుండగా.. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివన్న, బాలీవుడ్ యంగ్ ఆర్టిస్ట్ దివ్యేందు శర్మ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది.
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా, మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్, రూరల్ డ్రామా చిత్రం ‘లెనిన్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మేలో విడుదల కానున్నట్లు సమాచారం.
నిఖిల్ ‘స్వయంభు’ సమ్మర్ లో రిలీజ్! భారీ అంచనాలు!!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, ఇండో-కొరియన్ నేపథ్యంలో సాగే హారర్ కామెడీగా రూపుదిద్దుకుంటోంది. ఇక ఇందులో రితీకా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కూడా సమ్మర్ స్పెషల్‌గా మే ఆర్ జూన్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
నాని నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ది ప్యారడైజ్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వి సినిమాtggugjస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. జూన్25న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
జూన్ 26: చెన్నై లవ్ స్టోరీ
కిరణ్ అబ్బవరం మరియు శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో, రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు ప్రేమకథా చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. సాయి రాజేష్ మరియు SKN నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జూన్ 26న రిలీజ్ కానుంది.
మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సోసియో-ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించారు. ఇక ఇందులో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ మూవీ జూలై 10న విడుదల కానున్నట్లు టాక్.
సమ్మర్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఏ సినిమా విజయం సాధిస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


