|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టాలీవుడ్‌లో విషాదం.. బాలయ్య దర్శకుడు ఏఎస్‌ రవికుమార్ కన్నుమూత

Published: 11-06-2025, 1:43 AM
టాలీవుడ్‌లో విషాదం.. బాలయ్య దర్శకుడు ఏఎస్‌ రవికుమార్ కన్నుమూత

ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి గుండెపోటుతో మరణించారు. బాలకృష్ణ, గోపీచంద్, సాయి ధరమ్ తేజ్ వంటి నటులతో ఆయన చాలా సినిమాలు తెరకెక్కించారు. ఆయన మృతితో టాలీవుడ్ లో విషాదం నెలకొంది.

Key Points

1

ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి హఠాన్మరణం

2

బాలకృష్ణ, గోపీచంద్, సాయి ధరమ్ తేజ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించారు

4

గుండెపోటుతో మరణించారా? లేదా ఆత్మహత్య చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది

ఏఎస్ రవికుమార్ హఠాన్మరణం

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు ఏఎస్ రవికుమార్‌ చౌదరి కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఆయన  గుండెపోటుతో  మరణించినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో దర్శకుడిగా రాణించారు ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి. బాలకృష్ణ, గోపీచంద్‌, సాయి ధరమ్ తేజ్‌ వంటి హీరోలతో ఆయన మూవీస్‌ చేశారు.

ప్రస్తుతం దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన హఠాన్మరణం తెలుగు చిత్ర పరిశ్రమని కలచి వేస్తుంది. ఆయన మృతిపట్ల ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. అయితే గత కొంత కాలంగా ఏఎస్‌ రవికుమార్‌ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.  ఫ్యామిలీలో గొడవలు ఉన్న నేపథ్యంలో చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నారు.

గతేడాది ఆయన రాజ్‌ తరుణ్‌తో `తిరగబడరా సామీ`అనే చిత్రాన్ని రూపొందించారు. ఇది డిజాస్టర్‌ అయ్యింది. ఈ క్రమంలోనే దర్శకుడు డిజాప్పాయింట్‌లో ఉన్నట్టు సమాచారం.

బాలకృష్ణ, గోపీచంద్ తో సినిమాలు

సక్సెస్‌ లేకపోవడంతో చాలా కాలంగా ఒత్తిడిలో ఉన్నారని, కొంత మద్యానికి కూడా బానిసైనట్టు తెలుస్తోంది. ఇక దర్శకుడి మృతి పట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

అయితే రవికుమార్‌ చౌదరి నిజంగానే గుండెపోటుతో మరణించారా? సూసైడ్‌ చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌.. గోపీచంద్‌ హీరోగా వచ్చిన `యజ్ఞం` చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. ఆ తర్వాత బాలకృష్ణతో `వీరభద్ర` మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.

మృతికి కారణం తెలియాల్సి ఉంది

ఇక సాయి ధరమ్‌ తేజ్‌ తో `పిల్లా నువ్వు లేని జీవితం` మూవీని రూపొందించారు. ఇది బాగానే ఆడింది. ఆ తర్వాత నితిన్‌తో `ఆటాడిస్తా` సినిమా చేశారు. ఇది కూడా డిజాస్టర్‌ అయ్యింది.

దీంతో దర్శకుడిగా చాలా గ్యాప్‌ వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత రాజ్‌ తరుణ్‌తో `తిరగబడరా సామీ`ని రూపొందించగా, ఇది కూడా ఆడలేదు. దీంతో ఆయన మానసికంగా కుంగిపోయినట్టు సమాచారం.

ఏఎస్ రవికుమార్ మృతితో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి. మృతికి నిజమైన కారణం తెలియాల్సి ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.