|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మె.. కొత్త వారి కోసం నోటిఫికేషన్‌

Published: 05-08-2025, 1:19 AM
చిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మె.. కొత్త వారి కోసం నోటిఫికేషన్‌

టాలీవుడ్‌లో కార్మికుల వేతనాల పెంపుపై సమ్మె జరుగుతుండగా, నిర్మాతలు కొత్త వారిని నియమించుకునేందుకు ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. యూనియన్లతో సంబంధం లేకుండా నేరుగా నియామకాలు జరుగుతాయి.

Key Points

1

టాలీవుడ్‌లో కార్మికుల సమ్మె కారణంగా కొత్త ఉద్యోగుల నియామకం.

2

యూనియన్లతో సంబంధం లేకుండా నేరుగా నిర్మాతలు నియామకాలు చేపట్టనున్నారు.

4

ఆసక్తిగల వారు Atfpg.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

కార్మికుల సమ్మె & వేతనాల పెంపు

టాలీవుడ్ ‌ లో సమ్మె సైరన్ మోగడంతో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) ( Telugu Film Chamber of Commerce) ఒక కీలక నిర్ణయం తీసుకుంది . కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సమ్మెలోకి వెళ్లింది . దీంతో నిర్మాతలు కూడా కార్మికులకు అంత మొత్తం చెల్లించలేమని తేల్చేశారు . బయట ఉన్న ఉద్యోగాలతో పోల్చి చూస్తే ఇప్పటికే వర్కర్లకు ఎక్కువ చెల్లిస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు .

నిర్మాతల కొత్త నిర్ణయం

కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ తగ్గకపోవడంతో నిర్మాతలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు . నిర్మాతలు కొత్త మార్గాలు అన్వేషించారు. ఇక నుంచి యూనియన్లతో సంబంధం లేకుండా నిర్మాతలే ఒక నోటిఫికేషన్ ‌ విడుదల చేసి ఆసక్తికలిగిన కొత్తవారిని వర్క్ ‌ లోకి తీసుకోవాలని అనుకున్నారు . ఎంపిక అయిన వారిని పనికి తగినట్లు ట్రైయినింగ్‌ ఇచ్చి ఉద్యోగం కల్పించాలని చూస్తున్నారు .

నోటిఫికేషన్ వివరాలు & దరఖాస్తు ప్రక్రియ

మొత్తం 22 విభాగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ‌ విడుదల చేశారు . అందులో ఎడిటింగ్ ‌, మేకప్ ‌, కాస్ట్యూమ్స్ ‌, ప్రొడక్షన్ ‌, ఆర్ట్‌ వర్క్ ‌, కొరియోగ్రఫీ వంటివి కూడా ఉన్నాయి . ఆసక్తి వున్న వారు ధరఖాస్తు Atfpg.com చేసుకోవచ్చు . నిర్మాత అశ్వీనిదత్ ‌ కూడా ఆ నోటిఫికేషన్ ‌ లింక్ ‌ నే షేర్ ‌ చేశారు . మీలో ఎవరైనా ఔత్సాహిక నిపుణులు , కార్మికులు సినీ రంగంలో పనిచేయాలంటే వారితో పని చేయించుకోవడానికి నిర్మాతలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సభ్యత్వం కోసం రూ.లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నైపుణ్యం ఉన్న కార్మికులకు పని కల్పించడమే తమ ధ్యేయమని వారు పేర్కొన్నారు .

టాలీవుడ్‌లోని కార్మికుల సమస్యలకు పరిష్కారంగా, నిర్మాతలు కొత్త వారిని నేరుగా నియమించుకునేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయం సినీ పరిశ్రమ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.