
📌 Key Points
- రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’: ₹450 కోట్ల బడ్జెట్, ₹131 కోట్లు వసూలు, దిల్ రాజుకు భారీ నష్టం.
- అజిత్ ‘పట్టుదల’: ₹200 కోట్ల బడ్జెట్, ₹125 కోట్లు వసూలు, లైకా ప్రొడక్షన్స్‌కు పెద్ద నష్టం.
- కమల్ ‘థగ్ లైఫ్’: ₹200 కోట్ల బడ్జెట్, ₹97 కోట్లు వసూలు, కథ లోపం వల్ల ఫ్లాప్.
- సూర్య ‘రెట్రో’: ₹65 కోట్ల బడ్జెట్, అంచనాలు అందుకోలేక నిరాశపరిచింది.
2025లో భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు విజయం సాధిస్తే, మరికొన్ని పెద్ద స్టార్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చిన టాప్ 4 డిజాస్టర్ సినిమాల వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గేమ్ ఛేంజర్: భారీ అంచనాలు, దారుణ నష్టాలు
2025లో భారీ అంచనాలతో విడుదలైన కొన్ని సినిమాలు విజయం సాధించాయి. కానీ కొన్ని చిత్రాలు పెద్ద స్టార్లు నటించినా, వసూళ్లు, పరంగా వెనుకబడ్డాయి. ఆ సినిమాలేంటి, ఎందుకు ఫ్లాప్ అయ్యాయి. నిర్మాతలకు నష్టాలు మిగిల్చిన మూవీస్ ఏంటి?
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన ‘గేమ్ ఛేంజర్’ బడ్జెట్ 450 కోట్లు. ఇది భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటి. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.131 కోట్లు వసూలు చేసింది. నిర్మాత దిల్ రాజుకు నష్టాలు మిగిల్చింది మూవీ.
పట్టుదల: అజిత్ సినిమాకు భారీ ఎదురుదెబ్బ
అజిత్ కుమార్ నటించిన పట్టుదల ( విడాముయర్చి) బడ్జెట్ రూ.138-200 కోట్లు. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.125 కోట్లు మాత్రమే వసూలు చేసి భారీ ఫ్లాప్‌గా నిలిచింది. లైకా ప్రొడక్షన్స్‌కు ఇది పెద్ద నష్టాన్ని మిగిల్చింది.
కమల్ హాసన్, సింబు, మణిరత్నం కాంబోలో వచ్చిన ‘థగ్ లైఫ్’ బడ్జెట్ రూ.200 కోట్లు. కానీ, కేవలం రూ.97 కోట్లు మాత్రమే వసూలు చేసి భారీ నష్టాలను మిగిల్చింది. కథలో ఆసక్తి లేకపోవడమే ఫ్లాప్‌కు కారణం.
థగ్ లైఫ్, రెట్రో: కథలో లోపం, వసూళ్లలో వెనుకబాటు
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రెట్రో’. రూ.65 కోట్ల బడ్జెట్‌తో సూర్య సొంత నిర్మాణ సంస్థ నిర్మించింది. భారీ అంచనాలతో విడుదలై, వాణిజ్యపరంగా నిరాశపరిచింది.
స్టార్ పవర్ ఉన్నప్పటికీ, కథలో లోపాలు, అధిక బడ్జెట్ వంటి కారణాలతో ఈ సినిమాలు 2025లో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. బాక్సాఫీస్ అంచనాలను అందుకోలేక నిరాశపరిచాయి.


