|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ సినిమాలు.. టాప్ లో రజనీకాంత్ మూవీ.. టాప్-5 ఫిల్మ్స్ ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్కేయండి

Published: 08-09-2025, 3:43 AM
2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ సినిమాలు.. టాప్ లో రజనీకాంత్ మూవీ.. టాప్-5 ఫిల్మ్స్ ఓటీటీ లిస్ట్ పై ఓ లుక్కేయండి

2025 సంవత్సరంలో విడుదలైన తమిళ సినిమాలలో కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించాయి. ఈ జాబితాలో రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా టాప్ లో ఉంది. ఈ సినిమాలు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం.

Key Points

1

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాల జాబితా

2

రజనీకాంత్ 'కూలీ' సినిమా టాప్ లో నిలిచింది

4

సూర్య, అజిత్, ప్రదీప్ నటించిన సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి

అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 తమిళ చిత్రాలు

2025లో చాలా తమిళ సినిమాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చాయి. ఇందులో స్టార్ హీరోల సినిమాలూ ఉన్నాయి. కానీ వీటిల్లో కొన్ని చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. కలెక్షన్ల దుమ్ము రేపాయి. అలాంటి టాప్-5 తమిళ అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల లిస్ట్ ఇక్కడుంది. ఈ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయో చూసేద్దాం.

ఈ వయసులో తన స్వాగ్ తో, యాక్టింగ్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ తో కేకలు పెట్టిస్తున్నారు తలైవా రజనీకాంత్ . కూలీ అంటూ థియేటర్లలో ఆయన చేసిన హంగామా మామూలుగా లేదు. ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ వసూళ్ల జోరు అదిరింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.550 కోట్లకు పైగా రాబట్టి సంచలనం నమోదు చేసింది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన తమిళ మూవీ కూలీ . ఈ ఫిల్మ్ మరో మూడు రోజుల్లో ఓటీటీ లోకి రానుంది. సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.

రజనీకాంత్ ‘కూలీ’ సినిమా విజయం

తమిళ స్టార్ హీరో సూర్య కమ్ బ్యాక్ ఫిల్మ్ ‘రెట్రో’. ఈ మూవీ తమిళనాడును ఓ ఊపు ఊపింది. దీన్ని రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు. మే 1న రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.235 కోట్లు సాధించింది. సూర్య, పూజ హెగ్డే జంటగా నటించిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ లో ఉంది.

అజిత్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో అజిత్ తో త్రిష రొమాన్స్ చేసింది. ఈ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

సినిమాల ఓటీటీ విడుదల తేదీలు

ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ సినిమా ‘డ్రాగన్’. అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది. ప్రపంచవ్యాప్తంగా కలిపి రూ.152 కోట్లు ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహర్ తో ప్రదీప్ కెమిస్ట్రీ యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది. ఫిబ్రవరి 6న రిలీజైన ఈ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉంది.

అజిత్ కుమార్ నటించిన మరో యాక్షన్ థ్రిల్లర్ విదాముయార్చి కూడా ఈ లిస్టలో ఉంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-5 తమిళ సినిమాల్లో ఇది చివరిది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.99 కోట్లు కైవసం చేసుకుంది. దీనికి మాగీజ్ తిరుమేణి డైరెక్టర్. ఇందులో కూడా అజిత్ తో త్రిష హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 6న రిలీజైన ఈ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే అందుబాటులో ఉంది.

2025లో విడుదలైన తమిళ సినిమాలలో ‘కూలీ’ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. మరికొన్ని సూపర్ హిట్ సినిమాలతో ఈ జాబితా అభిమానులను ఆకట్టుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.