|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మేం ఈ కథని నమ్మాం: దర్శకుడు గుణశేఖర్‌

Published: 25-05-2025, 2:49 PM
మేం ఈ కథని నమ్మాం: దర్శకుడు గుణశేఖర్‌

దర్శకుడు గుణశేఖర్ తన కొత్త చిత్రం ‘యుఫోరియా’ గురించి మాట్లాడారు. ఈ చిత్రం యూత్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌తో ఉంటుందని, కథలోని నమ్మకంతోనే ఈ సినిమాను నిర్మించామని తెలిపారు.

Key Points

1

గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'యుఫోరియా' చిత్రం త్వరలో విడుదల కానుంది.

2

నూతన నటీనటులతో పాటు భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్ తదితరులు నటించారు.

4

యుఫోరియా సినిమా యూత్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌తో వినూత్నంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.

యుఫోరియా చిత్రం విశేషాలు

‘‘నేను ఏ సినిమా చేసినా ఒకే జానర్, ఒకే బ్యాక్‌డ్రాప్‌లో ఉండవు. అలా గతంలో చిరంజీవిగారితో ‘చూడాలని ఉంది’, ఎన్టీఆర్‌తో ‘రామాయణం’, మహేశ్‌బాబుతో ‘ఒక్కడు’ లాంటి కొత్త ప్రయత్నాలు చేస్తే ప్రేక్షకులు ఆశీర్వదించారు. ఇప్పుడు ఈ ‘యుఫోరియా’(Euphoria) కథను నేను, నా ఫ్యామిలీ నమ్మాం. అందుకే ఈ సినిమా తీశాను. ప్రేక్షకులను మా చిత్రం మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు గుణశేఖర్‌ అన్నారు.

‘ఫ్లై హై’ పాట విడుదల

గుణశేఖర్‌ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మించిన చిత్రం ‘యుఫోరియా’. నూతన నటీనటులతోపాటు ప్రముఖ తారలు భూమిక చావ్లా, సారా అర్జున్, నాజర్, రోహిత్‌ తదితరులు ముఖ్యపాత్రలుపోషించారు. ఈ చిత్రంలోని ‘ఫ్లై హై…’ అంటూ సాగే తొలిపాటను విడుదల చేశారు.  కాల భైరవ స్వరపరచిన ఈపాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. కాల భైరవ, పృథ్వీ చంద్ర, గాయత్రీ నటరాజన్‌ ఆలపించారు. ఈపాట ఆవిష్కరణ కార్యక్రమంలో గుణశేఖర్‌ మాట్లాడుతూ – ‘‘ఈ ‘ఫ్లై హై’తోపాటు సినిమాలో ఉన్న మూడుపాటలూ వినూత్నంగా ఉంటాయి.

నటీనటుల సమాచారం

యూత్‌ఫుల్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా తీస్తున్నాను. కథ నచ్చి మా ఫ్యామిలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది’’ అని చె΄్పారు. ‘‘ఫ్లై హై’లాంటి మంచిపాట ఇచ్చిన కాల భైరవగారికి థాంక్స్‌’’ అని నీలిమ గుణ అన్నారు. ‘‘యుఫోరియా’ మూవీ డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే కొత్త రకం మ్యూజిక్‌ ఇవ్వడానికి ట్రై చేశాను’’ అన్నారు కాల భైరవ. ‘‘తక్కువ సమయంలో గుణశేఖర్‌లాంటి దర్శకుడితో పని చేసే అవకాశం రావడం హ్యాపీ’’ అని కొరియోగ్రాఫర్‌ ఈశ్వర్‌ తెలిపారు. ఇంకా ఈ చిత్రంలో హీరోగా నటించిన విఘ్నేష్‌ గవిరెడ్డి, విలన్‌ పృథ్వీరాజ్‌ అడ్డాల కూడా మాట్లాడారు.

చిత్రయూనిట్ యుఫోరియా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశిస్తోంది. కొత్త ప్రయత్నంతో వచ్చిన ఈ సినిమా విజయవంతం అవుతుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.