
ప్రతి వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలవుతున్నాయి. గత వారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 సినిమాలు, వెబ్ సిరీస్ ల జాబితా ఇప్పుడు మీ ముందుంది. మలయాళం స్టార్ హీరో హిందీ సినిమా కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది.
Key Points
జియోహాట్‌స్టార్ లోని 'సర్జమీన్' సినిమా 4.5 మిలియన్ వ్యూస్ తో అగ్రస్థానంలో.
'స్పెషల్ ఆప్స్ 2' వెబ్ సిరీస్ 10.5 మిలియన్ వ్యూస్ తో అగ్రస్థానంలో.
కుబేర, రోంత్, ఆప్ జైసా కోయి, డీఎన్ఏ మూవీలు టాప్ 5లో ఉన్నాయి.
హంటర్ 2, మండల మర్డర్స్, గుటర్ గు 3 వెబ్ సిరీస్ లు టాప్ 5లో ఉన్నాయి.
టాప్ 5 ఓటీటీ మూవీస్
ఓటీటీల్లోకి ప్రతివారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వస్తాయన్న విషయం తెలుసు కదా. మరి వీటిలో ఆయా వారాల్లో ఎక్కువ మంది చూసిన మూవీస్, సిరీస్ ఏవో తెలుసుకోండి. గత వారానికి సంబంధించి ఆర్మాక్స్ మీడియా (Ormax Media) ఈ టాప్ 5 మూవీస్, వెబ్ సిరీస్ జాబితాను సోమవారం (జులై 28) రిలీజ్ చేసింది.
ఓటీటీ ల్లో గత వారం అంటే జులై 21 నుంచి 27 వరకు ఎక్కువ మంది చూసిన సినిమాల జాబితా ఇలా ఉంది. తొలి స్థానంలో జియోహాట్‌స్టార్ లోకి నేరుగా వచ్చిన సర్జమీన్ (Sarzameen) మూవీ నిలిచింది. ఈ సినిమాకు గత వారం 4.5 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్ లీడ్ రోల్స్ లో నటించారు. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమాకు ఈ స్థాయి వ్యూస్ వచ్చాయి. నిజానికి ఈ మూవీకి నెగటివ్ రివ్యూలే ఎక్కువగా వచ్చాయి.
టాప్ 5 ఓటీటీ వెబ్ సిరీస్
ఇక రెండో స్థానంలో అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న కుబేర మూవీ నిలిచింది. ఈ సినిమాకు గతవారం 3.7 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. ఇక జియోహాట్‌స్టార్ లోకి వచ్చిన మలయాళం థ్రిల్లర్ మూవీ రోంత్ ను గతవారం 2.3 మిలియన్ల మంది చూడటం విశేషం. ఇది మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోని ఆప్ జైసా కోయి సినిమా నిలిచింది. మాధవన్ నటించిన ఈ సినిమాకు గత వారం 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఐదో స్థానంలో జియోహాట్‌స్టార్ లోని తమిళ థ్రిల్లర్ డీఎన్ఏ 1.7 మిలియన్ వ్యూస్ తో నిలిచింది.
ఇక ఓటీటీల్లో గత వారం ఎక్కువ వ్యూస్ సాధించిన టాప్ 5 వెబ్ సిరీస్ జాబితా ఇలా ఉంది. ఇందులో స్పెషల్ ఆప్స్ సీజన్ 2 ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు గత వారం ఏకంగా 10.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీనికి దరిదాపుల్లో మరే సిరీస్ లేదు. రెండో స్థానంలో ఉన్న హంటర్ సీజన్ 2కి కేవలం 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
రికార్డు స్థాయి వ్యూస్
మూడోస్థానంలో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మండల మర్డర్స్ ఉంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు గత వారం 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. నాలుగో స్థానంలో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోని గుటర్ గు మూడో సీజన్ ఉంది. దీనికి 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఐదో స్థానంలో ఎంఎక్స్ ప్లేయర్ కే చెందిన మిట్టీ ఏక్ నయీ పెహచాన్ 2.2 మిలియన్ల వ్యూస్ తో నిలిచింది. ఈ ఎంఎక్స్ ప్లేయర్ లోని సినిమాలు, వెబ్ సిరీస్ అన్నింటినీ ఫ్రీగా చూసే వీలుండటంతో వీటికి పెద్ద ఎత్తున వ్యూస్ నమోదవుతున్నాయి.
గత వారం ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్ లకు లభించిన అద్భుతమైన ప్రేక్షకాదరణను ఈ నివేదిక చాటుతుంది. ప్రేక్షకుల ఎంపికలను బట్టి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల భవిష్యత్తును అంచనా వేయవచ్చు.


