
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఏ వెబ్ సిరీస్ చూడాలో సందేహం ఉందా? గత వారం ఎక్కువ మంది చూసిన టాప్ 5 వెబ్ సిరీస్‌ల జాబితా ఇక్కడ ఉంది. వీటిలో హారర్ థ్రిల్లర్స్, పొలిటికల్ థ్రిల్లర్స్ మరియు యాక్షన్ థ్రిల్లర్స్ ఉన్నాయి.
Key Points
వెన్స్‌డే సీజన్ 2 అత్యధిక వ్యూస్‌తో టాప్‌లో నిలిచింది.
సలాకార్, మయసభ వంటి తెలుగు సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
బిందియా కే బాహుబలి, సారే జహాన్ సే అచ్చా సిరీస్‌లు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.
వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అనేక ఆకర్షణీయమైన వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉన్నాయి.
టాప్ 5 ఓటీటీ వెబ్ సిరీస్‌లు
ఓటీటీల్లో ఏ వెబ్ సిరీస్ చూడాలో తేల్చుకోలేకపోతున్నారా? గతవారం ఎక్కువ మంది చూసిన సిరీస్ జాబితా ఇక్కడ ఇస్తున్నాం. వీటిలో నుంచి మీకు నచ్చిన వెబ్ సిరీస్ ఎంచుకొని చూడండి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, అమెజాన్ ఎంక్స్ ప్లేయర్ లాంటి ఓటీటీల్లో ఈ సిరీస్ ఉన్నాయి.
వెన్స్‌డే సీజన్ 2 – నెట్‌ఫ్లిక్స్
గత వారం ఎక్కువ వ్యూస్ సంపాదించిన వెబ్ సిరీస్ వెన్స్‌డే సీజన్ 2. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ కు ఆగస్టు 11 నుంచి 17 మధ్య ఏకంగా 4.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తొలి సీజన్ కంటే ఈ రెండో సీజన్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ప్రస్తుతానికి రెండో సీజన్ పార్ట్ 2 మాత్రమే అందుబాటులోకి వచ్చింది. వచ్చే నెలలో రెండో పార్ట్ కూడా రాబోతోంది.
సలాకార్ – జియోహాట్‌స్టార్
హారర్ థ్రిల్లర్, పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్‌లు
జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ సలాకార్. ఈ వెబ్ సిరీస్ రెండో స్థానంలో ఉంది. గతవారం ఈ సిరీస్ కు 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇండియా, పాకిస్థాన్ నేపథ్యంలో సాగే సిరీస్ ఇది. పాకిస్థాన్ అణు బాంబు తయారీ ప్రక్రియను దెబ్బకొట్టే ఇండియన్ స్పై చుట్టూ తిరుగుతుంది.
తెలుగు పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మయసభ . సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదో ఫిక్షన్ స్టోరీ అని మేకర్స్ చెబుతున్నా.. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్నేహం, వాళ్ల రాజకీయ జీవితాల చుట్టూ సాగే ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. గత వారం ఈ సిరీస్ కు 2.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
బిందియా కే బాహుబలి – అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్
ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగు సిరీస్‌లు
ఇక అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న బోల్డ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బిందియా కే బాహుబలి. బీహార్ లోని బిందియా అనే పట్టణం, అక్కడి ఓ క్రిమినల్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథ ఇది. గత వారం ఈ సిరీస్ కు 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
సారే జహాన్ సే అచ్చా – నెట్‌ఫ్లిక్స్
ఇక నెట్‌ఫ్లిక్స్ లోకి గతవారం అడుగుపెట్టిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ సారే జహాన్ సే అచ్చా. ఇది కూడా సలార్ లాగే పాకిస్థాన్ న్యూక్లియర్ బాంబ్ తయారీని అడ్డుకునే ఇండియన్ స్పై చుట్టూ తిరిగే స్టోరీనే. గత వారం ఈ వెబ్ సిరీస్ కు 2.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
మొత్తంగా, ఈ వారం విడుదలైన ఓటీటీ సిరీస్‌లు ప్రేక్షకులను వినోదంతో పూర్తిగా నింపాయి. విభిన్న రకాల కథలతో, ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన సిరీస్‌ను ఆస్వాదించవచ్చు.


