
ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న టాప్ 5 వెబ్ సిరీస్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ నంబర్ 1 స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. మిగతా ట్రెండింగ్ సిరీస్‌లు ఏవో చూద్దాం.
Key Points
ఆర్యన్ ఖాన్ 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' 3.2 మిలియన్ల వ్యూస్‌తో నంబర్ 1.
శ్రద్ధా శ్రీనాథ్ 'ది గేమ్' 2.4 మిలియన్ల వ్యూస్‌తో రెండో స్థానంలో నిలిచింది.
కాజోల్ 'ది ట్రయల్ సీజన్ 2' 2.1 మిలియన్ల వ్యూస్‌తో మూడో స్థానం దక్కించుకుంది.
'సిక్సర్ సీజన్ 2', '13th' సిరీస్‌లు టాప్ 5లో చోటు సంపాదించాయి.
నంబర్ 1 స్థానంలో ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్
ఓటీటీలో టాప్ 5 వెబ్ సిరీస్ లలో షారుఖ్ ఖాన్ తనయుడు తెరకెక్కించిన ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ముందుంది. ఈ వెబ్ సిరీస్ తో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. రిలీజ్ అయ్యాక ఈ సిరీస్ వరుసగా మూడు వారాలు టాప్‌లో ఉంది. దీనికి 3.2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
‘ది గేమ్’ ఒక తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్‌లో నటించింది. ఈ సిరీస్ 2.4 మిలియన్ల వ్యూస్‌తో వ్యూయర్‌షిప్ చార్ట్‌లో రెండో స్థానం సంపాదించింది. ఉత్కంఠ రేపే సన్నివేశాలతో ఇతర భాషాల్లో కూడా ఆడియన్స్ ను అలరించింది ది గేమ్.
టాప్ 5లో నిలిచిన ఇతర వెబ్ సిరీస్‌లు
కాజోల్, జిషు సేన్‌గుప్తా, షీబా చద్దా లీడ్ రోల్స్‌లో కనిపించిన ది ట్రయల్ సీజన్ 2 కూడా టాప్ 5 వెబ్ సిరీస్ లలో ప్లేస్ సాధించింది. ఈ సిరీస్ చాలా కాలంగా ట్రెండింగ్‌లో ఉంది. ఈ వారం 2.1 మిలియన్ల వ్యూస్‌తో మూడో స్థానం దక్కించుకుంది ది ట్రయల్ సీజన్ 2.
క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ‘సిక్సర్ సీజన్ 2’ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వారం దీనికి 2.0 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ లిస్ట్‌లో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. శివాంకిత్ సింగ్ పరిహార్, బాద్రి చవాన్, కరిష్మా సింగ్, బృజ్ భూషణ్ శుక్లా, , వైభవ్ శుక్లా వంటి నటులు ఈ సీరిస్ లో సందడి చేశారు.
ఈ వారం ట్రెండింగ్‌లో ఉన్న సిరీస్‌లు
వెబ్ సిరీస్ ’13th’ ఈ వారం 1.2 మిలియన్ల వ్యూస్‌తో ఐదో స్థానంలో నిలిచింది. . ఈ సిరీస్‌లో డిలన్ మిన్నెట్ , కేథరీన్ లాంగ్‌ఫోర్డ్ నటించారు ఒక అమ్మాయి మరణానికి సబంధించి 13 కారణాల చుట్టు ఈసినిమా తిరుగుతుంది. ఈసిరీస్ ను సోనీ లివ్ యాప్‌లో చూడొచ్చు.
మొత్తంగా, ఓటీటీలో ఈ వారం కూడా పలు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఆర్యన్ ఖాన్ సిరీస్ అగ్రస్థానంలో కొనసాగుతూ మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ జాబితాలోని అన్ని సిరీస్‌లు వీక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందిస్తున్నాయి.


